అజిత్ స్పెషాలిటీ అదే!

హైదరాబాద్: రజనీకాంత్‌ను పక్కన పెడితే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నంబర్ 1 ఎవరంటే వినబడుతున్న ఒకే ఒక పేరు అజిత్. గత ఏడాది ‘యెన్నై అరిందాల్’, ‘వేదాళం’ చిత్రాలతో రెండు హిట్స్ కొట్టాడు(ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ తెలుగు నిర్మాత ఏఎమ్ రత్నం కావటం విశేషం). మరోవైపు అతని సమకాలీనులు విజయ్, సూర్య గత ఏడాది విజయాన్ని చవి చూడకపోవటంతో అజిత్ ఆధిపత్యానికి ఎదురు లేకుండా పోయింది. మామూలుగానే కోలీవుడ్‌లో ఓపెనింగ్స్‌లో అజిత్‌ను కింగ్ అంటారు. దానికి తోడు రెండు మంచి విజయాలు సాధించటంతో అజిత్‌ పైచేయి స్పష్టంగా కనబడుతోంది.

అజిత్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హీరో అంటే ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండటం మొదటి ప్రత్యేకత. సహజంగానే అందగాడు, మంచి రంగుతోపాటు మేచోగా ఉంటాడు. ప్రొఫెషనల్ బైక్ రేసర్… చిన్నప్పుడు బైక్ మెకానిక్‌గా పనిచేశాడు. కోలీవుడ్‌లో అగ్రనటుడైనా కూడా లో ప్రొఫైల్‌ మెయింటెయిన్ చేస్తాడు. తన చిత్రాలకు సంబంధించిన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్‌లోనే కాకుండా, ఏ అవార్డ్ కార్యక్రమాలకు, పబ్లిక్ ఫంక్షన్‌లకు కూడా హాజరవడు. పబ్లిసిటీ లేకుండా ఛారిటీ చేస్తాడు. మరో హైలైట్ ఏమింటే, మామూలుగా మన హీరోలు కొంతమంది నిద్ర పోయేటప్పుడు కూడా విగ్గు గానీ, హెయిర్ ఎక్స్‌టెన్షన్‌గానీ పెట్టుకునే ఉంటారు. అజిత్ తన జుట్టు తెల్లబడిపోయినాకూడా, తను పోషించే పాత్ర రీత్యా అవసరమైతే తప్ప నల్లరంగు వేసుకోడు. వివాదాలుగానీ, ఎఫైర్‌లుగానీ లేవు. ఒకే ఒక్కరితోనే ఎఫైర్ పెట్టుకుని ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఆమె సినీ నటి షాలిని.అజిత్ తండ్రి కేరళ బ్రాహ్మిణ్ కాగా తల్లి కొల్‌కతాలో స్థిరపడిన సింధీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close