కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే నేచురల్‌ స్టార్‌ నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌, సంపూర్ణేష్‌బాబుతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి
సంగీతం: మణిశర్మ,
స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌,
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌,
ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి,
మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం,
స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌,
కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌,
నిర్మాత: సి.అశ్వనీదత్‌,
దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com