అక్బరుద్దీన్‌తో కేటీఆర్ వాగ్వాదం – పొలిటికల్ టర్న్ !

తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని.. అక్బరుద్దీన్ అనడంతో కేటీఆర్‌కు కోపం వచ్చింది. సభా నాయకుడితో అక్బరుద్దీన్‌కు ఏం పని అని ప్రశ్నించారు. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న మజ్లిస్ కు మాట్లాడేందుకు అంత సమయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అక్బరుద్దీన్ కూడా ఫీలయ్యారు. తమను ఏడుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని.. దీన్ని చాలెంజ్ గా తీసుకుంటామని వచ్చే ఎన్నికల్లో యాభై స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఉలిక్కి పడటం బీఆర్ఎస్ నేతల వంతయింది.

గత ఎన్నికల్లో కేసీఆర్ కు మజ్లిస్ పరోక్ష సహకారం ఎంతో లబించింది. ఎనిమిది చోట్ల తప్ప మజ్లిస్ ఇతర చోట్ల పోటీ చేయలేదు. అన్ని చోట్లా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పరోక్షంగా తమ వర్గానికి సంకేతాలు పంపింది. దీంతో ముస్లిం వర్లం ఎక్కువ ఉన్న చోట్ల బీఆర్ఎస్ విజయం సులువు అయింది. అయితే ఇటీవలి కాలంలో తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్… మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధయింది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్,బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో ఆ సంఖ్య యాభైకి చేరుకుంది.

కానీ బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల నిర్ణయాలు కేటీఆర్, అక్బర్ చేతుల్లో ఉండవు. కేసీఆర్, అసదుద్దీన్ చర్చించుకుని రాజకీయ వ్యూహాలు ఖరారు చేస్తారు. అసదుద్దీన్ తానుత్యాగం చేయడానికి ఎప్పుడూ ముందుకురారు. తన అవసరం ఉందని ఇతర పార్టీలు అనుకుంటే… గరిష్టంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. అందుకే.. ఇప్పుడు అక్బర్ ప్రకటనతో ముందు ముందు బీఆర్ఎస్‌కు క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close