ఆ వార్త‌ల్లో నిజం లేదంటున్న అఖిల్‌

అఖిల్ రెండో సినిమా చిక్కుల్లో ప‌డింద‌….ట‌, బ‌డ్జెట్ ఎక్కువైపోవ‌డంతో మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమా నుంచి త‌ప్పుకొంద‌…..ట‌, దాంతో అఖిల్ నిర్మాత‌ల కోసం అన్వేషిస్తున్నాడ‌…..ట అంటూ అఖిల్ సినిమా గురించి ప్ర‌చారం జ‌రుగుతోంది. అఖిల్‌ రెండో సినిమా బాధ్య‌త మైత్రీ మూవీస్ సంస్థ చేతికి అప్ప‌గించిన‌ట్టు, బ‌డ్జెట్ పెరిగిపోయంద‌న్న కార‌ణంతో మైత్రీ మూవీస్ ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. వీటిపై అఖిల్ స్పందించాడు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చాడు.

”మైత్రీ మూవీస్‌తో నేన‌స‌లు సినిమానే చేయ‌ట్లేదు. అలాంటిది వాళ్లు ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం ఏమిటి” అంటూ లాజిక్ తీస్తున్నాడు అఖిల్‌. వెబ్‌సైట్లో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, ఓ వార్త రాసే ముందు నిర్థారించుకొంటే బాగుంటుంద‌ని సూచిస్తున్నాడు అఖిల్. నాగార్జున‌కు ఊపిరిలాంటి హిట్ ఇచ్చిన వంశీపైడిప‌ల్లితో అఖిల్ త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం క‌థ‌పై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. క‌థ సిద్ధ‌మ‌య్యాకే అఖిల్ సినిమాని నిర్మాత ఎవ‌రన్న‌ది స్ప‌ష్టం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close