అఖిల్ ను ఇంప్రెస్ చేసిన దర్శకుడు.. ఛాన్స్ ఇచ్చేనా..!

అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్ తెరంగేట్రం ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే.. అఖిల్ అంటూ ఓ మిసైల్ లా వచ్చిన చినబాబు హిట్ కొట్టలేదు అన్న డిసప్పాయింటే కాని మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నంలో కొంతవరకు ఓకే అనిపించాడని చెప్పాలి. ఇక అఖిల్ కు చాలా అవసరమైన రెండో సినిమా హిట్ ఎవరి చేతిలో పెట్టాలా అనే ఆలోచనలో తర్జన భార్జనలో ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ.

మొదటి సినిమా వి.వి.వినాయక్ చేతిలో పెడితే అది కాస్త చాలా అపవాదాలు మూటకట్టుకునేలా చేసింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తన రెండో సినిమా ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లితో తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఊపిరి కథ చెప్పినప్పుడు నాగ్ పాత్ర నచ్చలేదు కాని ఆ సినిమా టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే వంశీ టాలెంట్ తెలుస్తుంది అని.. ఊపిరి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అఖిల్ అన్నాడు. సో వంశీ టాలెంట్ ను గుర్తించాడు కాబట్టి అతనితోనే తన రెండో సినిమా ఉంటుందని చూచాయగా చెప్పాడని అనుకుంటున్నారు సిని జనాలు.

వంశీ తీసిన సినిమాలను చూస్తే ఏది అట్టర్ ఫ్లాప్ అయిన దాఖలాలు లేవు. అయితే సూపర్ హిట్ లేదంటే యావరేజ్ గా నిలిచాయి తప్ప వంశీ చేసిన మున్నా ఒక్కటే కాస్త బిలో యావరేజ్ అయ్యింది కాని మిగతా సినిమాలన్ని మంచి రిజల్ట్ ను ఇచ్చాయి. మరి చూస్తుంటే ఇక అధికారికంగా అఖిల్ రెండో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లినే అని ఎనౌన్స్ చేయడమే తరువాయి అన్నట్టు ఉంది. ఎందుకంత తొందర ఒకవేళ అదే ఫిక్స్ అయితే అభిమానులకు త్వరలోనే ఎనౌన్స్ చేసేస్తారు అక్కినేని నాగార్జున.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close