ఇక నాగ్ ఫ్యామిలీ మొత్తం దిగిపోతారేమో..?

`విజేత‌` సినిమా కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగి ప‌బ్లిసిటీ కి ఊపు తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కానీ `విజేత‌` విజేత కాలేక‌పోయింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతోంది. `చిల‌సౌ` సినిమా కోసం. సుశాంత్ న‌టించిన చిత్ర‌మిది. సినిమా చూసిన అన్న‌పూర్ణ స్టూడియోస్ హ‌క్కుల్ని సొంతం చేసుకుని, సొంతంగా విడుద‌ల చేస్తోంది. సుశాంత్ సినిమా అంటే.. ఆడియోకో, ప్రీ రిలీజ్ కో అక్కినేని ఫ్యామిలీ క‌నిపిస్తుంటుంది. ఆ సినిమాని అన్న‌పూర్ణ సొంతం చేసుకుంది కాబ‌ట్టి.. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మొత్తం ప్ర‌మోష‌న్ల కోసం దిగిపోనుంది. ఇప్ప‌టికే నాగచైత‌న్య ప్రింట్ మీడియాల‌ను పిలిచి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్ ఓ పాట విడుద‌ల చేయ‌బోతున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి నాగ్ తో పాటు, చైతూ, స‌మంత‌లు కూడా రాబోతున్నారు. ఈ చిత్రంతో న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రాహుల్ స‌మంత‌కి అత్యంత స‌న్నిహితుడు. స‌మంత రిక‌మెండేష‌న్ మీదే ఈ సినిమాని అన్న‌పూర్ణ స్టూడియోస్ కొన్న‌ద‌ట‌. ఆ లెక్క‌న ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో సమంత కూడా దిగ‌డం దాదాపు ఖాయం. ఏ సినిమాకైనా ప్ర‌మోష‌న్ చాలా ముఖ్యం. చిన్న సినిమాల‌కు ఇంకా అవ‌స‌రం. అయితే… అతిగా ప్ర‌చారం చేసినా… దెబ్బ‌కొట్టే ఛాన్సుంది. మ‌ళ్లీరావా ఎలాంటి ప్ర‌మోష‌న్లూ లేకుండా విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. చిల‌సౌ కూడా అదే దారిలో వెళ్తే బాగుంటుందేమో. కాక‌పోతే.. అన్న‌పూర్ణ వారి సినిమా కాబ‌ట్టి… ఆర్భాటం కాస్త ఎక్కువైంది. మ‌రి ఈ ప్రచారం ఈ సినిమాకి ప్ల‌స్సో, మైన‌స్సో కాల‌మే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com