మా వాళ్ళు ఈరోజుకి కూడా ఆనందంగా లేరు – అక్కినేని నాగార్జున

కొత్త కొత్త దర్శకులను పరిచయం చేస్తూ, రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా, విభిన్న కథలను ఎంచుకుంటూ.. మల్టీ స్టారర్ సినిమాలను ప్రోత్సహిస్తున్న సీనియర్ హీరో ‘అక్కినేని నాగార్జున’. మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్ల తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, పి వి పి బ్యానర్ లో ఆయన చేసిన మరో విభిన్న కథా చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా మార్చి 24న ప్రేక్షకుల ముందుకి రానున్న సందర్బంగా ఆయనతో తెలుగు360.కామ్ జరిపిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విశేషాలు మీ కోసం..

ఓ పిజికల్ హాండీకప్పిడ్ పాత్ర చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ?

సినిమాలో నా పాత్ర చుట్టూ సానుభూతి లేకపోవడం, అనవసరమైన ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం.. పాత్ర చాలా ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలు నన్ను ఈ పాత్ర చేయడానికి ప్రేరేపించాయి.

ఈ పాత్రని మీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు ?

నేను కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారి నా అభిమానులు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారండి. అంత గొప్ప పాత్రలో నన్ను తెరమీద చూసిన తరువాత ఖచ్చితంగా నా అభిమానులు గర్వపడతారు, ప్రేక్షకులు కూడా అభినందిస్తారు.

మీ పాత్ర గురించి విన్నప్పుడు అమలగారు, మీ అబ్బాయిలు ఎలా రియాక్ట్ అయ్యారు ?
ఈరోజుకి కూడా వాళ్ళు ఆనందంగా లేరు. అలాంటి అంగవైకల్యం కలిగిన పాత్రలో నన్ను చూడటం వాళ్లకు ఇష్టం లేదు. కానీ అది కేవలం పాత్రేనని.. ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో నిలచిపోయే పాత్రని, నేనే వాళ్లకు నచ్చజేప్పాను.

మీ పాత్ర చేయడంలో ఏదైనా కష్టమనిపించిందా ?
ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాల్లో ఇదే కష్టమైనా సినిమా. ఎక్కువసేపు వీల్ చైర్ లోనే కూర్చుని యాక్టింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. పక్షవాతానికి గురైన వ్యక్తి పాత్రలో నా కదలికలు ఎలా ఉన్నాయో గమనించడానికి ఓ స్పెషల్ అసిస్టెంట్ ను అపాయింట్ చేశారు.

అలాంటి పాత్ర చేసిన తరువాత మీలో ఏమన్నా మార్పులు చోటుచేసుకున్నాయా ?
అవును, ఊపిరి నా జీవితాన్ని మార్చిన సినిమా. నాకు, నా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా తరువాత అంగవైకల్యం గల వ్యక్తుల పట్ల మరింత గౌరవం పెరుగుతుంది.

తమిళ వర్షన్ లో కూడా మీ పాత్రకి మీరే డబ్బింగ్ చెప్పినట్టున్నారు ?
అవును, కొద్ది రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తి చేశాను. నా పాత్రకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం కన్నా నేనే స్వయంగా డబ్బింగ్ చెబితే బాగుంటుందని కార్తి పట్టుబట్టడంతో నేనే డబ్బింగ్ చెప్పాను. కొంచెం కష్టమైన పనే అయినా మేనేజ్ చేశాను.

దర్శకుడు వంశీ పైడిపల్లితో పని చెయ్యడం ఎలా ఉంది ?
ఇప్పుడు కూడా మంచి పోజిషన్ లోనే వున్నా, ఈ సినిమా తరువాత వంశీ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడవుతాడు .అతను కథని అంకితం చేసుకున్న పద్దతి, అందంగా కథని చెప్పిన తీరు అందరికీ నచ్చుతాయి.

ఈ చిత్రం లో ముందుగా ఎన్టీఆర్ ను కూడా అనుకున్నట్టు వున్నారు?
మొదట ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళింది. కానీ అతనికి డెట్లు కుదరకపోవడంతో ఆ పాత్ర ను కార్తితో చేయించాం. ఈ సినిమా కోసం కార్తి చాలా బాగా కష్టపడ్డాడు.

అఖిల్ రెండవ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?
ప్రస్తుతం వంశీ పైడిపల్లితో కొన్ని ఐడియాల డిస్కషన్స్ లో ఉన్నాడు. ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. కథ సిద్దమైన తరువాతే నేను దీనిపై క్లారిటీ ఇవ్వగలను.

రాఘవేంద్ర రావుతో మీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?
ప్రస్తుతం లోకేషన్లు వెతికే పని జరుగుతోంది. మే నెలలో సినిమా మొదలవుతుంది. అంటూ ముగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close