అఫీషియ‌ల్‌: చిరు ఫ్యాన్స్ జ‌న‌సేన‌లోకి

చిరంజీవి అభిమాన సంఘ‌ల‌న్నీ జ‌న సేన పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి రెడీ అవుతున్నార‌ని కొద్ది రోజుల క్రితం నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి చిరు మ‌ద్ద‌తు కూడా దొరికింద‌ని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. చిరు అభిమాన సంఘాలన్నీ మూకుమ్మ‌డిగా జ‌న‌సేన పార్టీలో చేరి, మ‌ద్ద‌తు తెలిపాయి. భ‌విష్య‌త్తులు జ‌న‌సేన పార్టీతో క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని ప్ర‌తిన బూనాయి. ఈరోజు అఖిల భార‌త చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ స‌భ్యులు, అభిమానులు ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ”నేను కూడా చిరంజీవి అభిమానినే. హీరో అంటేనాకు ఆయ‌నే. ఆయ‌న్ని ఎవ‌రైనా ఓ మాట అంటే ఊరుకునేవాడ్ని కాదు. వెళ్లి కొట్టేసేవాడ్ని. విజేత స‌మ‌యంలో ‘నువ్వేమ‌వుదామ‌నుకుంటున్నావు’ అని అన్నయ్య అడిగితే ‘నీకు బాడీ గార్డ్‌గా ఉంటా’ అని చెప్పా. అంత‌కు మించి ఏమీ తెలీదు. ‘ప్ర‌జారాజ్యం`’పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా ఓ నాయ‌కుడి ద‌గ్గ‌ర సేవ‌కుడిలానే ప‌నిచేశా. అన్న‌య్య‌కూ నాకూ మ‌ధ్య దూరం ఉంద‌ని ఎవ‌రెవ‌రో ఏవేవో అనుకుంటున్నారు. కానీ మేం ఒక్క‌టే” అని అన్న‌య్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ని మ‌రోసారి చాటుకున్నాడు ప‌వ‌న్‌. చిరు ఫ్యాన్సంతా ఏక‌మై జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేయ‌డం పార్టీ ప‌రంగా ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. ఓ ర‌కంగా… జ‌న‌సేన‌కు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకులా మ‌రే బ‌లం… అభిమాన సంఘాల‌కు ఉంది. అయితే ఈ ఓటు బ్యాంకు రాబోయే ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన‌కు ఎంత వ‌ర‌కూ చేదోడు వాదోడుగా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close