ఏపీకి ప్రత్యేకహోదా ఎంతో దూరంలో లేదు..! చంద్రబాబుకు జాతీయ నేతల భరోసా..!

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కల నెరవేరడం.. ఎంతో దూరం లేదని… వివిధ పార్టీల నేతలు భరోసా ఇచ్చారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు హాజరైన నేతలు.. చంద్రబాబుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉదయం ప్రారంభమైన దీక్ష రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది. మాజీ ప్రధాని దేవేగౌడ.. చంద్రబాబుతో దీక్ష విరమింప చేశారు. చంద్రబాబు ముందు నుంచే పోరాట యోధుడని.. ఆయన నిబద్ధత ముందు నుంచి తెలుసని.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని కితాబిచ్చారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమంటే.. పాత రాష్ట్రానికి అన్యాయం చేయడమే అన్నట్టు ఏపీ విభజన జరిగిందన్నారు. మన్మోహన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను… నెరవేర్చాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందన్నారు. బీజేపీ, ఒకట్రెండు పార్టీలు మినహా అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు ..ఏపీకి ప్రత్యేకహోదా వచ్చేరోజు ఎంతో దూరంలో లేదని దేవెగౌడ ప్రకటించారు.

ముగింపు ప్రసంగంలో చంద్రబాబు… మోడీపై విరుచుకుపడ్డారు. మోడీని మించిన నటుడు దేశంలో ఎవరూ లేరన్నారు. గుజరాత్‌లో మత కల్లోలాలు రేపి… ఆపైన శాంతికోసం అంటూ… ప్రభుత్వ సొమ్ముతో దీక్షలు చేసిన చరిత్ర మోడీదని గుర్తు చేశారు. అలాంటి మోడీ.. తమ దీక్షలను ప్రశ్నించడం ఏమిటన్నారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నామని… లక్ష కోట్లు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉందన్నారు. అవి వచ్చే వరకూ దీక్షలు చేస్తామని ప్రకటించారు. దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారు … సాయం చేయాల్సిన రాష్ట్రాలను మాత్రం ఎండగడతారా? అని ప్రశ్నించారు. దళారీ చేయాల్సిన పనులను దేశ ప్రధాని చేసి పరువు తీస్తున్నారని తప్పుడు పనులు, అవినీతి చేసే మోదీ… మమ్మల్ని తప్పు పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, కాగ్‌, అన్నీ రాజ్యాంగ బద్ధ సంస్థలను భ్రష్టు పట్టించారు.గత ఎన్నికల సమయంలో అవినీతిపార్టీ వైసీపీని విమర్శించిన మోదీ… ఇప్పుడు వాళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకున్నారని విమర్శఇంచారు. మోదీ చేసిన దాడులను అందరూ ఏకమై తిప్పికొట్టాలాలని పిలుపునిచ్చారు. మేం బాగానే ఉన్నాం కదా అని మౌనం వహించినవారు బాధపడక తప్పదని హెచ్చరించారు. హిట్లర్‌ తరహాలో ఒక్కొక్కరిని టార్గెట్‌ చేస్తున్నారని.. గుర్తు చేశారు. కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం సాయం చేయకపోతుందా అని.. నాలుగేళ్లు ఎదురుచూశానన్నారు. ప్రత్యేకహోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నానని కానీ ఏపీకి ఇవ్వకుండా.. మరో 11రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఏపీ భవన్ దగ్గర ఉదయం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబానికి చంద్రబాబు రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. ఏపీ ఎంతటి మనస్థాపానికి లోనవుతుందో మోదీ గుర్తించాలని కోరరారు.

చంద్రబాబు సత్యాగ్రహానికి మేమంతా పూర్తి మద్దతు ఇస్తున్నామని.. చంద్రబాబు కోరుకున్నట్టు ఏపీకి న్యాయం జరగాల్సిందే సంఘిభావం తెలిపిన కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆకాంక్ష వ్యక్తం చేసారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నది కాంగ్రెస్‌ విధానమన్నారు. కాంగ్రెస్‌ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వడంలేదని అడిగితే… ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం మాట్లాడుతోందని మండిపడ్డారు. హుబ్లీలో ప్రత్యేక డివిజన్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని నేను అడిగితే.. విశాఖ రైల్వేజోన్‌ కారణంగా లేటవుతోందని అంటారని .. అదే ఏపీ వాళ్లు అడిగితే ఒడిశా అభ్యంతరం చెబుతోందంటారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఉంటేనే అందరం ప్రశాంతంగా ఉంటాం.. కానీ మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఉదయం నుంచి బీజేపీయేతర పార్టీల నేతలందరూ… వచ్చి సంఘిభావం తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు దీక్ష.. రాజకీయాల్లో కీలక మలుపుగానే భావించవచ్చన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com