టాలీవుడ్ ఆశ‌ల‌న్నీ ‘ల‌వ్ స్టోరీ’పైనే

సెకండ్ వేవ్ త‌ర‌వాత థియేట‌ర్లు తెర‌చుకున్నా పెద్ద‌గా ఊపు రాలేదు. ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం లాంటి ఒక‌ట్రెండు చిన్న సినిమాలు వ‌సూళ్లు అందుకున్నాయి. `సిటీమార్‌`కి తొలి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయినా – ఆ త‌ర‌వాత ఒక్క‌సారిగా డ‌ల్ అయిపోయాయి. ఈ శుక్ర‌వారం కూడా సినిమాలొచ్చినా – దేనికీ ఓపెనింగ్స్ లేవు. దాంతో టాలీవుడ్ లో కంగారు మొద‌లైంది. మంచి సినిమాలు రావ‌ట్లేదా? జ‌నాల‌కు సినిమాలు చూడాలన్న ఆస‌క్తి పూర్తిగా త‌గ్గిపోయిందా, లేదంటే ఓటీటీల‌కు అల‌వాటు ప‌డిపోయారా? అనేది ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు వాళ్ల ఆశ‌ల‌న్నీ `ల‌వ్ స్టోరీ`పైనే.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. శేఖ‌ర్‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమాన గ‌ణం ఉంది. యూత్ త‌న సినిమాల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌. కుటుంబ ప్రేక్ష‌కుల‌లోనూ ఫాలోయింగ్ ఉంది. వాళ్లంతా ఈ సినిమా కోస‌మైనా క‌దిలి వ‌స్తార‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. పాట‌లు, ట్రైల‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. మ‌రీ ముఖ్యంగా `సారంగ ద‌రియా` యూ ట్యూబ్ రికార్డుల్ని సృష్టించింది. ఆ పాట కోస‌మైనా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క‌దిలి వ‌స్తార‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంది. హైద‌రాబాద్ లో `ల‌వ్ స్టోరీ` అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. వాటి ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగానే ఉన్నాయి. ఇదే ఊపు కొన‌సాగితే.. తొలి రెండు రోజులూ.. `ల‌వ్ స్టోరీ` ఆడే థియేట‌ర్లు హౌస్ ఫుల్ బోర్డుల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌తాయి. ల‌వ్ స్టోరీ హిట్అయితే ద‌స‌రాకు వ‌స్తున్న సినిమాల‌కు కాస్త ఊపొస్తుంది. `ల‌వ్ స్టోరీ`నీ చిన్న‌చూపు చూశారంటే – టాలీవుడ్ మ‌రిన్ని క‌ష్టాల్లో ప‌డిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేన వైపు బాలినేని చూపు !?

జగన్ బంధువు .. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి తరపు బంధువు కావడంతో ఆయనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా...

మహేష్ బర్త్ డే.. పవన్ స్పెషల్ పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుతున్నారు....

“ఖైదీల” కోసం వైఎస్ఆర్‌సీపీ !

వైసీపీ నేతలు ఖైదీల కోసం ఆరాట పడుతున్నారు. గత వారం జైల్లో ఉన్న ఎంపీలకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఓ ప్రైవేటు బిల్లును ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో...

ఇక ఏపీలో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ !

ఏపీలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ చేసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే తవ్వకాలు చేసుకోవచ్చని నేరుగా చెప్పడమన్నమాట. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close