మోదీ వెలుగుల వెనుక అసలు నిజాలు..! ఫ్యూజ్ ఎగిరిపోతుందందే..!!

మణిపూర్‌లో ఓ కుగ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించి… దేశం మొత్తం వెలిగిపోతోందని ప్రకటించారు నరేంద్రమోదీ. అలా ఆయన అన్నారో లేదో… పదులసంఖ్యలో గ్రామాలకు అదీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామాలకు దశాబ్దాల నుంచి కరెంట్ సౌకర్యం లేని విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మాట ప్రకారం విద్యుత్ సౌకర్యం పొందిన చిట్ట చివరి గ్రామం మణిపూర్ రాష్ట్రంలోని లీజింగ్. కొండ ప్రాంతంలో చిట్ట చివరన.. సరిహద్దులో ఉండే ఆ గ్రామానికి విద్యుదీకరణతో అతి పెద్ద టాస్క్ పూర్తి చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ ద్వారా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఇండియా పవర్ ఫుల్ కంట్రీ అంటూ తనదైన మార్క్ కాన్ఫిడెన్స్ ను ట్వీట్ లో చూపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కరెంట్ సౌకర్యం లేని గ్రామాలు 18,452 ఉన్నట్లు గుర్తించి.. వాటికి వెయ్యి రోజుల్లో కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. పన్నెండు రోజుల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని జబ్బలు చరుచుకున్నారు.

నరేంద్రమోదీ ప్రకటన గురించి దేశంలో కొన్ని వందల గ్రామాలకు ఇంకా తెలియదు. ఎందుకంటే..తెలుసుకోవడానికి వారి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలేమీ లేవు. వాటిని వాడటానికి అవసరమైన కరెంట్ వాళ్ల ఊళ్లలో లేదు. ఈ గ్రామాలకు కరెంట్ ఇచ్చేందుకు కనీస ప్రయత్నం అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ.. ఇటు కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ జరగలేదు. కనీసం ఆయా గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించడనికి ఉన్న ఇబ్బందులేమిటో కూడా.. గుర్తించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కానీ నరేంద్రమోదీ మాత్రం… ఈ గ్రామాలు లెక్కలోనివి కాదని తేల్చేశారు. దేశంలో అత్యంత చివరిగా ఉన్న గ్రామానికి విద్యుత్ ఇస్తే… ఇక దేశంలో అందరికీ కరెంట్ అందుతోందన్న భావనలో మోదీ ఉండిపోయారు. మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే.. విద్యుత్ లేని గ్రామాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడవుతోంది. యూపీఏ హయాంలో .. నాలుగేళ్లలోనే కాంగ్రెస్ లక్ష గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2004 వరకు దేశంలో… 94 శాతం గ్రామాల విద్యుదీకరణ పూర్తయింది. ఈ నాలుగేళ్లలో ఆరు శాతం పూర్తి చేయలేకపోయారు. కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు.

దేశంలో అంతా బాగుందన్నట్లు .. చెప్పుకోవడానికి కేంద్రం ఇటీవలి కాలంలో అనేక ప్రయత్నాలు చేస్తోంది. నోట్ల రద్దుతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని.. నివేదికలు విడుదల చేస్తోంది. నష్టపోయిన ఉద్యోగాలకు బదులుగా అంతకు రెండింతలు సృష్టిచామని చెప్పుకుంటోంది. దేశం మొత్తం నగదు సమస్యలున్నా.. ఎక్కడా ఇబ్బందుల్లేవని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కరెంట్ విషయంలోనూ నేరుగా ప్రధానే రంగంలోకి దిగి… ఇక విద్యుత్ లేని గ్రామాలు దేశంలో లేవని ప్రకటించడంతో ప్రజలు కూడా ఆశ్చర్య పోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close