న‌రేష్ మారిపోయాడు

అల్ల‌రి న‌రేష్‌.. ఈ పేరు వింటే చాలు. మ‌న ప్ర‌య‌త్నం లేకుండానే పెదాల‌పై చిరున‌వ్వులు పూస్తాయి. త‌ను చేసిన పాత్ర‌లు, ఇచ్చిన సినిమాలు అలాంటివి. అయ‌తే గ‌త కొన్నేళ్లుగా న‌రేష్ ఖాతాలో హిట్టు ప‌డ‌లేదు. న‌వ్వించే ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం అవుతూనే ఉన్నాయి. ప్రేక్ష‌కుల పంథా కూడా మారింది. కేవ‌లం న‌వ్వుకోవ‌డానికే వాళ్లు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదు. వాళ్ల‌కు కావ‌ల్సిన కామెడీ సోష‌ల్ మీడియాలోనే కావ‌ల్సినంత దొరుకుతుంది. ఈ ప‌రిస్థితుల్లో న‌రేష్ జోన‌ర్ మార్చాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఇప్పుడు అదే చేశాడు.

ఈరోజే న‌రేష్ కొత్త సినిమా ఒక‌టి ప‌ట్టాలెక్కింది. ఈ సినిమాని `నాంది` అని పేరు పెట్టారు. ఎప్పుడూ లేనిది.. ఈ సినిమాలో గెడ్డం లుక్‌తో క‌నిపించ‌బోతున్నాడున‌రేష్‌. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ని కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు. పోలీస్ క‌స్ట‌డీలో త‌ల‌కిందులుగా వేలాడుతూ ఉన్న పోస్ట‌ర్ అది. ఇందులో న‌రేష్ న‌గ్నంగా క‌నిపిస్తున్నాడు. దీన్ని బ‌ట్టి న‌రేష్ ఏదో విభిన్న ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి.. ఈ మార్పుతో న‌రేష్ జాత‌కం కూడా మారుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close