మమతా బెనర్జీతో లొల్లి..! ఇక మోడీకి ఎవరూ కొత్త మిత్రులు లేనట్లే..!?

నరేంద్రమోడీ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నట్లుగా చేసిన హెచ్చరికలతో… ప్రాంతీయ పార్టీల్లో ఓ రకమైన అలజడి ప్రారంభమయింది. ఇప్పటికే.. మోడీ మళ్లీ గెలిస్తే… నియంతృత్వం తరహా పాలన సాగుతుందని… ఇతర పార్టీలకు మనుగడ ఉండదన్న భయం… ఆయా పార్టీల్లో ఉంది. ఇలాంటి సమంయలో… తృణమూల్ విషయంలో.. నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదుల్లో కలకలం రేపాయి. అటు రాజకీయవర్గాల్లోనూ… విస్మయం వ్యక్తం అయింది.

మోడీకి మిత్రులు ఎవరూ అక్కర్లేదా..?

మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా.. కేంద్రంలో ఏ ప్రభుత్వమూ ఏర్పడే అవకాశం లేదన్న విషయాన్ని.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మిత్రుల్ని పెంచుకోవాల్సిన మోదీ.. శత్రువుల్ని పెంచుకుంటున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించడం.. శరద్ పవార్ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి విమర్శించడం..చంద్రబాబు రాజకీయ జీవితాన్ని అంతం చేస్తామని సవాల్ చేసి.. రాజ్యాంగ సంస్థలన్నింటినీ ప్రయోగించడం.. బిజూపట్నాయక్‌పై లేనిపోని అవినీతి ఆరోపణలు చేయడం.. లాంటివన్నీ ఈ కోణంలోకే వస్తాయి. ఇలాంటి రాజకీయాలతో… బీజేపీ తీరుపై.. మోడీ, అమిత్ షాల వ్యవహారశైలిపై… కొత్తగా ఎవరూ మిత్రులుగా వచ్చే అవకాశం లేదు. మోడీపై కసితో అయినా… కాంగ్రెస్ గూటికి చేరే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రహస్య మిత్రులపై మోడీకి నమ్మకం ఏమిటి..?

మిత్రపక్షాల అవసరం మోడీకి తెలుసు. గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ వట్టి పోయింది. చాలా పార్టీలు దూరమయ్యాయి. కొన్ని పార్టీలను అతి కష్టం మీద సీట్లు త్యాగం చేసి..మరీ కూటమిలో ఉంచుకోవాల్సి వచ్చింది. ఇక తెలుగుదేశం లాంటి పార్టీలతో వ్యవహరించిన తీరు … కొత్తగా.. ఎవరైనా బీజేపీతో జతకడదామన్నా.. ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది. అసలు మిత్రుల్ని వదిలేసి.. రహస్య మిత్రుల్ని తెచ్చి పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతుగా ఉంటాయని ప్రచారం జరుగుతున్న పార్టీలు కూడా..కచ్చితంగా ఆదే విధానంతో ఉంటాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. ఆయా పార్టీలకు కావాల్సింది.. అధికారపక్షం అండ. జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలకు కావాల్సింది కేసుల మాఫీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం అవకాశం ఉన్నా…మరో మాట లేకుండా ఆ పార్టీ వద్దకు వెళ్లిపోతారు. తమిళనాడులో అన్నాడీఎంకే , ఒడిషాలో బీజేడీలను బ్లాక్ మెయిల్ చేసి వ్యవహారం నడిపిస్తున్నారు. వారు అవకాశం వస్తే బీజేపీని తొక్కేయడానికి వెనుకాడరు.

మోడీని పక్కన పెట్టడానికి బీజేపీ కూడా వెనుకాడదు..!

బీజేపీకి పూర్తి మెజార్టీ రాని పక్షంలో..మోదీని ప్రధానిగా అంగీకరించే పార్టీ ఒక్కటి కూడా లేదు. చివరికి ఎన్డీఏలో అతి పెద్ద మిత్రపక్షాలుగా… ఉన్న జేడీయూ, శివసేన కూడా..మోడీ, అమిత్ షాలను పక్కన పెడితే… ఆలోచిస్తామనే రాజకీయకోణాన్ని ఆవిష్కరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. నితీష్ కుమార్ … మోడీకి బద్ద వ్యతిరేకి. శివసేన ఎన్నికలు కాబట్టి పొగుడుతోంది కాబట్టి.. మోడీని ప్రధాని పదవిలో చూడటానికి ధాకరేలు సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితులు వస్తే.. నాయకత్వ మార్పు వైపు ఆలోచించడానికి బీజేపీ, ఆరెస్సెస్ ఏ మాత్రం…. ఆలోచించవు. ఇప్పటికే నితిన్ గడ్కరీ రూపంలో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. మోడీ … దారుణమైన రాజకీయాలతో… అందర్నీ దూరం చేసుకుంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close