ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మ‌ళ్లీ కెలికావ్ క‌దా..

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కీ, అల్లు అర్జున్ కీ మ‌ధ్య ఏం జ‌రిగింది?? ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది. మొన్న‌టికి మొన్న స‌రైనోడు ఫంక్ష‌న్లో ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్ … అంటూ కాంట్ర‌వ‌ర్సీ తుట్టెను క‌దిపాడు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీపై అల‌క‌బూనారు. బ‌న్నీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. బ‌న్నీది ఇప్ప‌టికీ అదే మాట‌. ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకొస్తే… ”ఇప్పుడూ అదే మాట‌.. ప‌వ‌న్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్‌.“ అంటూ మ‌రోసారి ప‌వ‌న్ ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేశాడు.

ఇప్పుడు ఈ ఇంట‌ర్వ్యూ.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి తెగ కెలికేస్తోంది. ప‌వన్‌గురించి ఎందుకు మాట్లాడ‌డు, అంత పెద్దోడైపోయాడా.. అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీపై విసుర్లు విసురుతున్నారు. స‌రైనోడు ఫంక్ష‌న్లో నోరుజారి చెప్పిన మాట‌ను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. మ‌ళ్లీ దాన్ని ఎందుకు కెలుక్కొన్నాడో కూడా మెగా ఫ్యాన్స్‌కీ ముఖ్యంగా బ‌న్నీ కాంపౌండ్ వ‌ర్గాల‌కూ అస్సలు తెలియ‌డం లేదు. ఈరోజు ఉద‌యం నుంచీ బ‌న్నీకి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి.. గోల పెడుతున్నార‌ట‌. ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాల‌ని బ‌న్నీకూడా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఏదైనా ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్లో.. ప‌వ‌న్ గురించి ఎందుకు అలా మాట్లాడాల్సివ‌చ్చిందో చెప్ప‌డానికి బ‌న్నీ ప్రిపేర్ అవుతున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close