బన్నీ, లింగుస్వామి ఫిక్స్…అఫిషియల్

తమిళ్‌లో మంచి హిట్ సినిమాలే అందించాడు లింగుస్వామి. ఆవారా లాంటి క్లాసిక్ హిట్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కానీ తెలుగులో ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలన్న ఆయన కోరిక మాత్రం ఒక పట్టాన పట్టాలెక్కలేదు. మహేష్‌బాబుకి కథ చెప్పాడు. సెట్ కాలేదు. ఎన్టీఆర్‌ని కూడా కలిశాడు. కానీ కమిట్ చేయించలేకపోయాడు. అయితే మొదటి నుంచీ కూడా చాలా ఎక్కువ సార్లు కలిసింది మాత్రం అల్లు అర్జున్‌నే. ఆ ప్రయత్నాలన్నీ వర్కవుట్ అయ్యి ఫైనల్‌గా బన్నీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘డిజె’ సినిమాలో యాక్ట్ చేస్తున్న ఆ తర్వాత లింగుస్వామి డైరెక్షన్‌లో యాక్ట్ చేయనున్నాడు. తెలుగు, తమిళ్ భాషలో భారీగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఙానవేల్ రాజా నిర్మించనున్నాడు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ డిటెయిల్స్, ప్రొడక్షన్ డిటెయిల్స్ తెలియచేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close