ఫ్లాష్ బ్యాక్‌: త్రివిక్ర‌మ్ డైలాగ్‌.. బ‌న్నీ క‌ర‌క్ష‌న్‌

త్రివిక్ర‌మ్ ని అంతా మాట‌ల మాంత్రికుడు అని పిలుచుకుంటారు ముద్దుగా. ఆ పేరుకి త‌న‌కంటే న్యాయం చేసేవాళ్లు ఎవ్వ‌రూ ఉండ‌రు. ప్ర‌తీ సీన్‌లోనూ.. ఓ ఛ‌మ‌క్కుమ‌నే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగులు ప‌ల‌క‌డానికైనా త్రివిక్ర‌మ్ తో క‌ల‌సి ప‌నిచేద్దామ‌నుకుంటారు అంతా. త్రివిక్ర‌మ్ రాస్తే.. ఆ డైలాగ్ కి తిరుగు ఉండ‌దు. అలాంటి త్రివిక్ర‌మ్ డైలాగ్ ని ప‌క్కన పెట్టి, హీరో ఓ కొత్త డైలాగ్ చెబితే. దాన్ని త్రివిక్ర‌మ్ ఓకే చేస్తే…?

`అల వైకుంఠ‌పురం` సెట్లో అదే జ‌రిగింది. ఈ సినిమాలో బ‌న్నీ – హ‌ర్ష‌వ‌ర్థ‌న్ మ‌ధ్య ఓ సీన్ ఉంటుంది. `ఓ త‌రానికి మీరు ఇన్‌స్పిరేష‌న్‌` అని.. ఓ తిట్టుని పొగ‌డ్త‌లా.. చెబుతాడు బ‌న్నీ. ఆ డైలాగ్ బాగా క్లిక్క‌య్యింది. ఇప్పుడు చాలా చోట్ల మీమ్స్ రూపంలో ఆ డైలాగ్ క‌నిపిస్తోంది. నిజానికి ఈ డైలాగ్ స్క్రిప్టులో లేదు. అక్క‌డ `మీరు గ్రేట్ సార్‌..` అనే డైలాగ్ రాశాడు త్రివిక్ర‌మ్. సెట్లో బ‌న్నీకి అప్ప‌టికప్పుడు త‌ట్టిన ఆలోచ‌న ఇది. త్రివిక‌మ్ కి చెబితే.. ఆయ‌న న‌వ్వేసి.. `పెట్టేద్దాం` అన్నారు. అయితే క‌ర‌క్ష‌న్ చేసిన విష‌యం హ‌ర్ష వ‌ర్థ‌న్ కి చెప్ప‌లేదు. టేక్ లో బ‌న్నీ ఈ డైలాగ్ చెప్ప‌గానే.. హ‌ర్ష ఓ షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చారు. దాన్ని అలానే ఉంచేశాడు త్రివిక్ర‌మ్‌. అలా.. త్రివిక్ర‌మ్ డైలాగ్ ని ప‌క్క‌న పెట్టి, బ‌న్నీ ఓ కొత్త డైలాగ్ ప‌లికాడ‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని ఈమ‌ధ్యే హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌.. సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. త్రివిక్ర‌మ్ డైలాగ్ నే మార్చాడంటే… బ‌న్నీ మామూలోడు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close