చిరుకి టార్గెట్ ఫిక్స్ చేసిన బ‌న్నీ

రూ.50 కోట్లు, రూ.100 కోట్లు, రూ.150 కోట్లు.. ఇలా తెలుగు సినిమా రేంజ్ పెరుగుతూ ఉంది. బాహుబ‌లి రూ.600 కోట్లు కొట్టినా, ప్ర‌తీసారీ ఈమ్యాజిక్ సాధ్యం కాదు. కానీ సినిమా బాగుంది అన్న‌టాక్ వ‌స్తే.. వంద కోట్లు ఎగ‌రేసుకుపోవ‌డం ఖాయం. శ్రీ‌మంతుడులా సూప‌ర్ హిట్ట‌యితే.. రూ.150 కోట్లు కొల్ల‌గొట్టేస్తుంది. ప్ర‌స్తుతం చిరంజీవి టార్గెట్ కూడా రూ.150 కోట్లేన‌ట‌. ఈ విష‌యమేమీ గాలి వార్త కాదు. స్వ‌యంగా మెగా హీరో అల్లు అర్జున్ ఫిక్స్ చేసిన టార్గెట్ ఇది. చిరంజీవి 150 వ సినిమా 150 కోట్లు సాధించి తీరాల‌ని బ‌న్నీ చెబుతున్నాడు. చిరంజీవి ద‌గ్గ‌ర బ‌న్నీ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాడ‌ట కూడా.

”మ‌రోసారి ఫామ్ లోకి వ‌స్తున్నారు.. ఈసారి 150వ సినిమా కాబ‌ట్టి.. 150 కోట్లు కొట్టాల్సిందే” అంటూ చిరంజీవి చేయి ప‌ట్టుకొని చెప్పాడ‌ట బ‌న్నీ. ఈ విష‌యాన్ని స‌రైనోడు స‌క్సెస్‌మీట్‌లో బ‌న్నీనే స్వ‌యంగా చెప్పాడు. చిరు సినిమాకి రూ.150 కోట్లు తెచ్చిపెట్టేందుకు మ‌న‌మంతా క‌ల‌సి కృషి చేయాలి.. అంటూ మెగా ఫ్యాన్స్ ద‌గ్గ‌ర మాట తీసుకొన్నాడు. అంటే.. చిరంజీవి టార్గెట్ ఫిక్స‌య‌పోయింద‌ట‌న్న‌మాట‌. రూ.150వ సినిమాకి రూ.150 కోట్లు. అంకెలు బాగానే ఉన్నాయి.. మ‌రి వ‌ర్క‌వుట్ అవుతుందంటారా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close