మెడిక‌ల్ మాఫియా క‌థ‌లో.. బ‌న్నీ?

అల్లు అర్జున్ ఇప్పుడు `పుష్ప 2`పైనే ఫోక‌స్ పెట్టాడు. పుష్ప ఇచ్చిన కిక్ అలాంటిది. ఇప్పుడు పుష్ప కంటే.. పుష్ప 2ని ఇంకా పెద్ద హిట్ చేయాల‌న్న క‌సితో ఉన్నాడు బ‌న్నీ. అయితే మ‌రోవైపు కొత్త క‌థ‌లు కూడా వింటున్నాడు. పుష్ప త‌ర‌వాత త‌న కెరీర్‌ని ఎలా మ‌ల‌చుకోవాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో బ‌న్నీకి పూర్తి స్ప‌ష్ట‌త ఉంది. అందుకే కొన్ని క‌థ‌ల్ని ఓకే చేసి ప‌క్క‌న పెట్టుకొంటున్నాడు.

రీసెంట్ గా ప‌ర‌శురామ్ బ‌న్నీకి ఓ క‌థ చెప్పిన‌ట్టు టాక్‌. ఇది బ‌న్నీకి కూడా బాగా న‌చ్చింది. `దీన్ని పూర్తి స్థాయిలో డ‌వ‌లెప్ చేయ్‌..` అంటూ బ‌న్నీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. మెడిక‌ల్ మాఫియా నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ని స‌మాచారం. `గీత గోవిందం` లాంటి పెద్ద హిట్ త‌ర‌వాత‌.. గీతా ఆర్ట్స్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి అడ్వాన్స్ ఇచ్చుకొన్నాడు. అప్పుడే బ‌న్నీతో ప‌ర‌శురామ్ సినిమా ఓకే అయ్యింది. అయితే… బ‌న్నీ వ‌రుస ప్రాజెక్టుల వ‌ల్ల‌.. ప‌ర‌శురామ్ సినిమా కాస్త లేట‌య్యింది. ఈలోగా ప‌ర‌శురామ్ కూడా త‌న చేతిలో ఉన్నా అడ్వాన్సుల‌కు న్యాయం చేస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. దాంతో పాటుగా బ‌న్నీ క‌థ‌పై కూడా వ‌ర్క్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close