బ‌న్నీకి కామెడీ కావాల‌ట‌

డీజే, నా పేరు సూర్య వైఫ‌ల్యాల‌తో అల్లు అర్జున్ కెరీర్ కాస్త కుదుపుకి లోనైంది. నా పేరు సూర్య రిల‌జ్ట్ అయితే మ‌రీ ఘోరం. అందుకే ద‌ర్శ‌కుల ఎంపిక విష‌యంలో `స్టార్‌` హోదానే చూసుకుంటున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్‌, విక్ర‌మ్ కె.కుమార్‌, సురేంద‌ర్‌రెడ్డిల‌ను ఓకే చేసేశాడు బ‌న్నీ. త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఎలాగూ ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంటుంది. కానీ మిగిలిన‌వి రెండూ సీరియెస్ స‌బ్జెక్టులేన‌ట‌. `నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా` దెబ్బ‌తో సీరియ‌స్ క‌థ‌లంటే బ‌న్నీకి ఒణుకు పుడుతోంది. ‘రేసుగుర్రం’లా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కోరుకుంటున్నాడు బ‌న్నీ. అందులో భాగంగా… మారుతితో సినిమా చేయ‌డానికి బాగా ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మారుతి ఇటీవ‌లే.. బ‌న్నీకి ఓ లైన్ చెప్పాడు. అది బ‌న్నీకి బాగా న‌చ్చేసింది. ‘ఈ లైన్‌ని వీలైనంత త్వ‌ర‌గా…. స్క్రిప్టు రూపంలో చూపించు’ అన్నాడ‌ట‌. దాంతో మారుతి.. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఓవైపు ‘శైల‌జారెడ్డి అల్లుడు’ సినిమా పనుల్లో ఉన్న మారుతి, మ‌రోవైపు బ‌న్నీకి కావల్సిన రీతిలో ఓ స్క్రిప్టు త‌యారు చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఒకేవేళ మారుతి స్క్రిప్టు గ‌నుక న‌చ్చితే… దాన్ని ఎప్పుడైనా స‌రే.. ప‌ట్టాలెక్కించేయ‌డానికి బ‌న్నీ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com