ఏంటీ… స‌రైనోడు లీకా??

ఫ్లాష్‌..ష్లాష్‌. స‌రైనోడు సినిమా లీకైంది. పైర‌సీ భూతం మ‌ళ్లీ.. ప‌డ‌గ విప్పింది. సినిమా విడుద‌లకు ముందే.. లీకైపోయింది. అత్తారింటికి దారేదితో వికృత‌రూపం దాల్చిన ఈ జాడ్యం.. ఇప్పుడు స‌రైనోడుకీ అంటుకొంద‌ట‌. ఈనెల 22న స‌రైనోడు సినిమా విడుద‌ల కాబోతోంది. అయితే వారం రోజుల ముందే.. ప‌ది హేను నిమిషాల సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దాంతో చిత్ర బృందం త‌ల‌లు ప‌ట్టుకొంది. వెబ్ లింకుల‌న్నీ వెదికిప‌ట్టుకొని. వాటిని డిలీట్ చేసే ప‌నిలో త‌ల‌మున‌క‌లైపోయింది చిత్ర‌బృందం.

శుక్ర‌వారం అర్థరాత్రి ఆన్‌లైన్‌లో కొన్ని లింకుల్ని క‌నిపెట్టింది గీతా ఆర్ట్స్‌. అందులో… స‌రైనోడు సినిమాకి సంబంధించి కొన్ని స‌న్నివేశాలున్నాయ‌ట‌. దాంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై.. త‌నకున్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఆ లింకుల్ని తొల‌గించింది. ఇంకా ఏమైనా లింకులు మిగిలి ఉన్నాయా అనే విష‌యంపై తీవ్ర‌మైన గాలింపు చేప‌ట్టింది. విడుద‌ల‌కు ముందే సినిమాలోని కీల‌క‌మైన స‌న్నివేశాలు బ‌య‌ట‌కు వచ్చేయ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రి ద్వారా లీక‌య్యాయి అన్న విష‌యంపై ఇప్పుడు లోతైన ప‌రిశోధ‌న చేస్తున్నార్ట‌. ఇదే విష‌యాన్ని గీతా ఆర్ట్స్ సిబ్బందిని అడిగితే ”స‌రైనోడు లీకా?? అలాంటిదేం జ‌ర‌గ‌లేదే” అంటున్నారు. కానీ.. లీకైన మాట నిజ‌మ‌ని, అయితే స‌కాలంలో స్పందించ‌డం వ‌ల్ల పెను ప్ర‌మాదం త‌ప్పందని ఇండ్ర‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close