నాపేరు సూర్య పై క‌క్ష క‌డ‌తారేమో: అల్లు అర‌వింద్ షాకింగ్ కామెంట్స్

గ‌త కొన్ని రోజులుగా సాగుతున్న సెగ `నా పేరు సూర్య` సినిమాపై ప‌డ‌నుందా? ఈ సినిమాపై కొన్ని వ‌ర్గాలు, మీడియా శ‌క్తులు క‌క్ష క‌ట్టే ప్ర‌మాదం ఉందా? ఆ అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు అల్లు అర‌వింద్‌. నా పేరు సూర్య ఆడియో ఫంక్ష‌న్‌లో అర‌వింద్ మాట‌లు… క‌ల‌కలం రేపాయి. ”ఇండ్ర‌స్ట్రీలో సాగుతున్న ప‌రిణామాలు మీ అంద‌రికీ తెలుసు. ఈ సినిమాపై క‌క్ష క‌ట్టే అవ‌కాశాలున్నాయి. ప‌నిగ‌ట్టుకుని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమ‌ర్శ‌కులు చేస్తారు. ఈ వేదిక వెనుక ఓ విష‌యం జ‌రిగింది. అది త‌ర‌వాత చెబుతాను” అని ఆవేశంగా మాట్లాడారు. దాంతో నా పేరు సూర్య ఆడియో వేడుక జ‌రుగుతున్న స్టేజీ వెనుక ఏం జరిగింది? మీడియాలో ఎవ‌రు `సూర్య‌`కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌నున్నారు? అనే అనుమానాలు, ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. మెగా కుటుంబానికీ కొన్ని మీడియా సంస్థ‌ల‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల యాడ్లు కొన్ని టీవీ ఛాన‌ళ్ల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని మెగా హీరోలు నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మ‌రి స్టేజీ వెనుక ఏం జ‌రిగిందో అర‌వింద్ చెబుతారా? ఆయ‌న అనుమానాలు ఎవ‌రిపైన‌? ఇవ‌న్నీ ‘సూర్య‌’ ఆడియో వేడుక మిగిల్చిన ప్ర‌శ్న‌లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close