ఫ్లాప్ డైరెక్ట‌ర్ని న‌మ్ముకున్న అల్లువార‌బ్బాయి

అల్లు అర్జున్ చేతికి ఓ సూప‌ర్ హిట్టొచ్చింది. ఇక అల్లు శిరీష్‌నే కాస్త గాడిలో ప‌డాలి. త‌న‌కో హిట్టు ఇవ్వాల‌ని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ అంతా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఎట్ట‌కేల‌కు ఓ క‌థ సెట్ అయ్యింది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘ప్యార్ ప్రేమ‌ కాద‌ల్’ ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. 2018లో విడుద‌లైన ఈ సినిమా అక్క‌డ యూత్‌ని బాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో డ‌బ్ చేశారు కూడా. కానీ.. అల్లు శిరీష్ రీమేక్ కోసం ప్ర‌య‌త్నించ‌డంతో డ‌బ్బింగ్‌ని ఆపేశారు. ఇప్పుడీ సినిమాకి రాకేశ్ శ‌శి చేతిలో పెట్టారు. మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌తో `విజేత‌`తీసిన ద‌ర్శ‌కుడీయ‌న‌. విజేత ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే.. మెగా కుటుంబం ఈ ద‌ర్శ‌కుడిపై నమ్మ‌కం ఉంచడం విశేషం. గీతా ఆర్ట్స్‌లో చాలా క‌థ‌లు త‌యార‌వుతున్నాయి. చాలామంది యువ ద‌ర్శ‌కులు గీతా ఆర్ట్స్‌లో క‌థ‌లు సిద్దం చేస్తున్నారు. వాళ్ల‌లో ఎవ‌రికి అవ‌కాశం ఇచ్చినా.. శిరీష్‌తో ఓ హిట్టు సినిమా తీయ‌గ‌ల‌రు. కానీ…. మ‌ళ్లీ రాకేశ్ శ‌శిని న‌మ్మడం.. ఆలోచించాల్సిన విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close