ఆ హీరోకి సాయి పల్లవి ఫిదా

సాయి పల్లవి.. ఒక్క సినిమాతో పాపులరైపోయిన హీరోయిన్. మలయాళంలో ”ప్రేమమ్” సినిమాలో మలర్ అనే క్యారక్టర్ చేసి అందరికీ దగ్గరైంది సాయి పల్లవి. ఈ సినిమాతో యువత హృదయాల్ని కొల్లగొట్టేసింది.

ఇప్పుడు ఫిదాతో ఏకంగా టాలీవుడ్ కుర్రకారు మదిని ఫిదా చేసేసింది. ఫిదాలో భానుమతిగా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టేసింది. సాయి పల్లవి నటనకు ఇప్పుడు అంతా ఫిదా అయిపోయారు. అయితే సాయి పల్లవి ఫిదా అయిపోయే హీరో ఒకరు వున్నారు. అతను ఎవరో కాదు.. తమిళ్ స్టార్ సూర్య. సాయి పల్లవికి డ్రీం హీరో సూర్యనట. ఈ విషయం ఆమెనే చెప్పింది.

”సూర్య సార్ అంటే పిచ్చి. అది మాటల్లో చెప్పలేను. నేను సూర్య సార్ తో కలిసి నటిస్తానో లేదో తెలియదు. కానీ ఆయన్ను ఓ సారి కలసి నా అభిమానం అంతా చెప్పేయాలని వుంది” అని తెగ ఇదైపోయింది సాయి. ప్రస్తుతం ఫిదా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న భానుమతి.. నాగశౌర్యతో ఓ సినిమా చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.