మాజీ ప్రియుడిపై అమ‌లాపాల్ ప‌గ

మిత్రులుగా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. త‌ప్పులు కూడా ఒప్పులైపోతాయి. పొర‌పొచ్చాలు వ‌స్తే మాత్రం.. ఒప్పులు త‌ప్పులుగా.. మారి తిప్ప‌లు పెడుతుంటాయి. అమ‌లాపాల్ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. అమ‌లాపాల్ త‌న మాజీ ప్రియుడు భ‌వింద‌ర్ సింగ్ పై ఇప్పుడు కోర్టులో కేసు వేసింది.

విష‌యం ఏమిటంటే… అమ‌లాపాల్ .. గాయ‌కుడు భ‌వింద‌ర్ సింగ్ ఇద్ద‌రూ గ‌తంలో క్లోజ్ గా ఉండేవారు. ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని కూడా అనుకున్నారంతా. ఓ సంద‌ర్భంగా భ‌వీంద‌ర్ సింగ్ త‌న ఇన్‌స్ట్రాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో భ‌వీంద‌ర్‌, అమ‌లాపాల్ పెళ్లి దుస్తుల్లో ఉండ‌డం చూసి.. అంతా షాక్ తిన్నారు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. వెంట‌నే.. భ‌వింద‌ర్ ఆ ఫొటోల్ని ఇన్‌స్ట్రాలోంచి తొల‌గించాడు. ఇది జ‌రిగి చాలా కాలం అయ్యింది.

అయితే తాజాగా ఈ వ్య‌వ‌హారం మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది. త‌న అనుమ‌తి లేకుండా… త‌న ఫొటోల్ని ఇన్‌స్ట్రాలో పెట్టి, త‌ప్పుడు సంకేతాలు పంపాడ‌ని, త‌న ప‌రువుకి తీవ్ర న‌ష్టం క‌లిగించాడ‌ని భ‌వీంద‌ర్ పై కోర్టులో కేసు వేసింది. దీనిపై స‌మాధానం చెప్పాలంటూ న్యాయ‌స్థానం భ‌వీంద‌ర్‌కు నోటీసులు కూడా పంపింది. ఎప్పుడో జ‌రిగిన విష‌యాన్ని అమ‌లాపాల్ ఇప్పుడు బయ‌ట‌కు తీసుకొచ్చిందేమిటా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  అమ‌లాపాల్ – భ‌వీంద‌ర్ మ‌ధ్య విబేధాలు రావ‌డంతో …వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని, అందుకే పాత విష‌యాల్ని త‌వ్వి… త‌న మాజీ ప్రియుడిపై ప‌గ తీర్చుకుంటోంద‌ని సినీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. మ‌రి .. అమ‌లాపాల్ ఏమంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close