నయా రాయ్‌పూర్ ఇరవైఏళ్లు అయినా అభివృద్ధి చెందలేదని అమరావతి ఎలా చెందగలదని కొంత మంది మూర్ఖ శిఖామణులు ప్రచారం చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వృద్ధి అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల పరంగా చూస్తే రాయ్‌పూర్‌తో అమరావతిని పోల్చడం తెలివి తక్కునతనం. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్ నిర్మాణ శైలిని చూసి అమరావతిని కూడా కేవలం ఒక పరిపాలనా నగరం గా కొందరు పొరబడుతుంటారు. అయితే, రాయ్‌పూర్ ప్రాజెక్టులో ప్రధాన లోపం ఏమిటంటే, అక్కడ కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలకే ప్రాధాన్యత ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక ప్రణాళికలు గానీ, యువతకు ఉపాధి కల్పించే ఐటీ హబ్‌లు గానీ అక్కడ నామమాత్రమే. పైగా, ఆ రాష్ట్రం నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఫలితంగా, సూర్యాస్తమయం తర్వాత రాయ్‌పూర్ వీధులు వెలవెలబోతుంటాయి.
అమరావతి: వ్యాపార, వాణిజ్యాల వారధి
దీనికి పూర్తి భిన్నంగా అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్‌లోని రెండు అతిపెద్ద వాణిజ్య నగరాలైన విజయవాడ , గుంటూరుల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతం ఇప్పటికే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలుగా వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలో కీలక స్థానంలో ఉంది. జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్ ,కృష్ణా నది ఒడ్డున ుండటం అమరావతిని సహజసిద్ధమైన ఆర్థిక కేంద్రంగా మార్చాయి. రాయ్‌పూర్ లాగా ఇది ఒక ఐసోలేటెడ్ నగరం కాదు. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి పెట్టుబడికి విజయవాడ, గుంటూరుల రూపంలో అపారమైన మార్కెట్ అందుబాటులో ఉంటుంది.
పెట్టుబడుల స్వర్గధామం
అమరావతి కేవలం ప్రభుత్వ భవనాలకే పరిమితం కాకుండా, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు అమరావతి అభివృద్ధికి ముందుకు రావడం ఇక్కడి వ్యూహాత్మక ప్రాధాన్యతకు నిదర్శనం. ఐటీ, బయోటెక్నాలజీ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చేలా ఇక్కడ నైన్ థీమ్ సిటీస్ ను ప్లాన్ చేశారు. ఇది రాయ్‌పూర్‌లో మచ్చుకైనా కనిపించని ఒక గొప్ప దార్శనికత. రాయ్‌పూర్ పరిమితులు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైతే, అమరావతి ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారంగా ఎదిగే సత్తా కలిగి ఉంది. పోర్టులకు సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌లో అమరావతి కీలక పాత్ర పోషించనుంది. సింగపూర్ వంటి దేశాల భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం వల్ల, ఇక్కడ మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా ఉంటున్నాయి.
రాయపూర్ కేవలం పరిపాలనా రాజధాని
రాయ్‌పూర్ ఒక రాష్ట్ర రాజధానిగా మాత్రమే మిగిలిపోగా, అమరావతి ఒక ఎకనామిక్ ఇంజిన్ గా మారబోతోంది. భౌగోళికంగా అనుకూలమైన ప్లేస్, పారిశ్రామిక అనుకూల వాతావరణం, నిరంతరం అభివృద్ధి చెందుతున్న చుట్టుపక్కల నగరాల ప్రభావం వల్ల అమరావతి భవిష్యత్తులో దుబాయ్ లేదా సింగపూర్ తరహాలో అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలవడం ఖాయం. ఆ ఉపాధి కల్పన, ఆ పెట్టుబడుల ఆకర్షణ రాయ్‌పూర్‌లో ఊహించలేము. అందుకే అమరావతి అప్రతిహతం. అమరావతిపై ద్వేషంతో వైసీపీ బ్యాచ్ చేసే వింత వింత విశ్లేషణలు కడుపు మంటతో మాత్రమే.
