చిన్న సినిమాల్ని లాగేసిన అమేజాన్‌

క‌రోనా ఎఫెక్ట్ చిత్ర‌సీమ‌పై భారీగా ప‌డింది. షూటింగులు లేవు. థియేట‌ర్లో సినిమాలూ లేవు. అంతా ఇంటి ప‌ట్టునే ఉన్నారు. వాళ్లంద‌రికీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్సే వినోద సాధ‌నాలు. ఈ స‌మ‌యాన్ని త‌న‌కు అనుగుణంగా స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవ‌డంలో స‌ఫ‌లీకృతం అవుతోంది అమేజాన్‌. ఇటీవ‌ల విడుద‌లైన చిన్న సినిమాల‌న్నీ ఇప్పుడు ఆమేజాన్‌లో క‌నిపిస్తున్నాయి. మార్చి 6న విడుద‌లైన ఓ పిట్ట‌క‌థ‌, అనుకున్న‌దొకటీ – అయిన‌ది ఒక్క‌టీ లాంటి సినిమాలు ఇప్పుడు అమేజాన్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. విడుద‌లైన రెండు వారాల‌కే ఇప్పుడు ఇవి అమేజాన్లో క‌నిపించ‌డం విశేషం.

నిజానికి చిన్న సినిమాల్ని కొనుగోలు చేయ‌డంలో అమేజాన్ ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే ఆమేజాన్‌లో చాలా పెద్ద సినిమాలున్నాయి. వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కావ‌ల్సినంత కంటెంట్ మూట‌గ‌ట్టి ఉండ‌డంతో.. అస‌లు చిన్న సినిమాల్ని కొనడం లేదు. అయితే ఇప్పుడు టోకుగా సినిమాల‌న్నీ అమేజాన్ లోనే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. `మా సినిమాని కొనండి ప్లీజ్‌` అంటూ అమేజాన్ చుట్టూ తిరిగిన నిర్మాత‌ల్ని ఏమాత్రం ప‌ట్టించుకోని ఆ సంస్థ ఇప్పుడు పిలిచి మ‌రీ సినిమాల్ని తీసుకుంటోంది. అయితే.. సినిమాల్ని మాత్రం కొన‌డం లేదు. అంతా రెవిన్యూ షేర్ మీదే. ఆ సినిమా ఆమేజాన్‌లో ఎంత‌మంది చూశారు? ఎంత సేపు చూశారు? అనే అంకెని బ‌ట్టి రెవిన్యూ పంచ‌బోతోంది అమేజాన్‌. ఓ ర‌కంగా ఇది ఉభ‌య‌తార‌కం. అస‌లు త‌మ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో అమ్ముడుపోలేద‌న్న బాధ నిర్మాత‌ల‌కు ఉండ‌దు. చిన్న సినిమాని కొన్నామ‌న్న అసంతృప్తి అమేజాన్‌కూ ఉండ‌దు. అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం… థియేట‌ర్ వ‌ర‌కూ వెళ్లి చూడ‌లేక‌పోయిన కొన్ని చిన్న సినిమాలు ఇప్పుడు అమేజాన్‌లో ఫ్రీగా చూసేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close