చంద్రబాబుపై అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

ఎవరైనా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినంత మాత్రాన్న వారు చాల సమర్ధులు, నీతిపరులు, మేధావులు అనుకోనవసరం లేదు. అత్యున్నత పదవులలో ఉన్నప్పటికీ వారు కూడా తప్పులు లేదా పొరపాట్లు చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఆ పదవికి ఉన్న విలువా, గౌరవం దృష్ట్యా వాటిని చేపట్టినవారినీ గౌరవించడం ఒక సత్సంప్రదాయం. కానీ రాజకీయాలలో నైతిక విలువల గురించి నిత్యం లెక్చర్స్ ఇచ్చే వైకాపా నేతలకి మాత్రం అటువంటి సంప్రదాయాలని ఏమాత్రం పట్టించుకొనే అలవాటు బొత్తిగా కనబడదు.

యధారాజా తధాప్రజా అన్నట్లుగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చెప్పులు, రాళ్ళు, చీపుర్లతో కొట్టమని ప్రజలని రెచ్చగొడుతుంటే వైకాపా ఎమ్మెల్యేలు రోజా, ఈశ్వరి, కొడాలి నాని వంటి వాళ్ళు ముఖ్యమంత్రి పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతుంటారు.

తాజాగా ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరొందిన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బిచ్చగాడితో పోల్చారు. కేంద్రం బిచ్చం వేస్తున్నట్లు నిధులు విదిలిస్తుంటే ఆయన బిచ్చాగాడిలాగ చాలా సంతోషంగా తెచ్చుకొంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చేందుకే ప్రజలు ఆయనని ఎన్నుకొన్నారు తప్ప బిచ్చగాడిలా కేంద్రాన్ని అడుక్కోవడానికి కాదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి రోజుకొక మాట మాట్లాడుతూ, మరోపక్క కేంద్రంతో పోరాడుతున్నట్లు నటిస్తూ కేంద్రం విదిలిస్తున్న దానిని తెచ్చుకొని సంతోషపడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

రాష్ట్ర విభజన సమయంలో రాజధాని నిర్మాణానికి రూ.5లక్షల కోట్లు అవసరం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రప్రభుత్వం బిచ్చం వేసినట్లు 2500 కోట్లు మాత్రమే విదిలిస్తే గట్టిగా నిలదీసి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఉద్దేశ్యించి అంబటి రాంబాబు ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పు. ముఖ్యమంత్రిని ఏమని విమర్శించినా ఆయన పట్టించుకోకపోవచ్చు కానీ ప్రజలు తప్పకుండా పట్టించుకొంటారు. ముఖ్యమంత్రిలో తపొప్పులని ఎవరైనా ఎత్తి చూపవచ్చు కానీ అందుకు వాడే బాష ఆమోదయోగ్యంగా ఉండాలి. కేంద్రాన్ని నిధుల కోసం ముఖ్యమంత్రి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏనాడూ ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీయడంలేదని తెలుసు.

దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రప్రభుత్వాన్ని నిధుల కోసం అభ్యర్దిస్తూనే ఉంటారు. కనుక వారినందరినీ బిచ్చగాళ్ళనగలమా?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందరిలాగే కేంద్రాన్ని నిధులు అడుగుతున్నారు. ఆ విషయం అంబటి రాంబాబు స్వయంగా అంగీకరిస్తున్నారు. బహుశః దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడులాగ నిధుల కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉండరు. ఆయన ఆ పని చేస్తునందుకు అభినందించకపోగా బిచ్చగాడు అని అవహేళన చేయడం అహంకారమే అనుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close