సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో పేద పెన్షనర్ల దగ్గర డబ్బులు గుంజిన కేసులో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు విడుదలయ్యారు. ఆయన జైల్లో ఉండటంతో అంబటిని కాపు మహా నేత పేరుతో వైసీపీ హైకమాండ్ చేయాల్సినంత రాజకీయం చేస్తోంది. కాపు నేతపై దాడి చేస్తారా అని వైసీపీ కాపు నేతలంతా రోజూ వచ్చి ఆయన కుటుంబాన్ని, జైల్లో ఉన్న అంబటిని పరామర్శిస్తూ వచ్చారు.
మీడియాతో మాట్లాడుతూ వచ్చిన ఆయన కుమార్తె కూడా.. మా కాపు కుటుంబంపై దాడి అని ముందూ వెనుకా కుల ప్రస్తావన తెస్తూ కల రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన అంబటి మాత్రం తాను కాపు నేతనని..తనపై దాడి చేశారని మాత్రం చెప్పుకోలేదు. తనపై దాడి చేశారని.. తనను చంపారని చూశారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని.. తప్పు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాప పడ్డానని కూడా చెప్పుకొచ్చారు.
ఎన్ని రోజులు జైల్లో పెట్టినా ఉండేందుకు సిద్ధమయ్యానని.. కేసులు పెడితే భయపడతానని అనుకున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా తాను కూటమి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకూ పోరాడతానని ప్రకటించారు. ఓ వైపు వైసీపీ ఆయనను కాపు మహానేతను చేస్తే.. అంబటి మాత్రం..ఆ గుర్తింపును కోరుకోకపోవడం విచిత్రంగా మారింది.
