మళ్ళీ తన ద్వంద వైఖరి ప్రదర్శించుకొన్న అమెరికా!

అమెరికా యుద్ధోన్మాదం, దాని ద్వంద వైఖరి గురించి కొత్తగా చెప్పుకోవలసినది ఏమీ లేదు. పడికట్టు దౌత్య పదాలతో తిమ్మిని బమ్మి చేసే విధంగా మాట్లాడటం అమెరికాకే చెల్లును. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతూ భారత్ తమకు మిత్రదేశమని ఏవేవో కబుర్లు చెపుతుంటారు. మరో వైపు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు భారత్ విద్యార్ధులను ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, వెనక్కి తిప్పి పంపించేస్తుంటారు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి జాన్ కిర్బి పాకిస్తాన్ న్ని భారత్ కి వ్యతిరేకంగా ఎగదోస్తుంటారు.

మొన్న గురువారం జాన్ కిర్బి వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ, “పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. దానిపై విచారణ జరిపించి అందుకు కారకులయిన వారిపై తగిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చేరు. దానిపై పాక్ ప్రభుత్వమే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ దాడికి పాల్పడినవారెవరో కనుగొని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేము. ఇది చాలా క్లిష్టమయిన పని. కనుక అందుకు మేము నిర్దిష్ట గడువు విదించలేము,” అని అన్నారు.

దీనిపై ఒక పత్రిక ప్రతినిధి అడిగిన కొన్ని ప్రశ్నలకు జాన్ కిర్బి చెప్పిన సమాధానాలు కూడా అమెరికా ద్వంద వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.

“గత రెండు దశాబ్దాలుగా ఇటువంటి దాడులు జరిగినప్పుడల్లా పాక్ ప్రభుత్వం ఇలాగే చాలా హామీలు ఇచ్చింది కానీ ఇంతవరకు ఒక్కరినీ శిక్షించలేదు. అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడికి పాల్పడిన ఒసామా బిన్ లాడెన్ గురించి అమెరికా దళాలు వెతుకుతున్న సంగతి తెలిసీ కూడా పాకిస్తాన్ అతన్ని తన సైనిక స్థావరానికి సమీపంలో ఒక భవనంలో రహస్యంగా దాచి ఉంచింది తప్ప అమెరికాకు అప్పగించలేదు. కనుక పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకోగలదని భావిస్తున్నారా?” అని ప్రశ్నించినపుడు “ఈ విషయంలో పాక్ ప్రభుత్వానికి తగు చర్యలు చేపట్టడానికి అవకాశం ఇవ్వాలి. దానికి కొంత సమయం పడుతుంది. కనుక నిర్దిష్ట గడువులోగా ఈదాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని పాకిస్తాన్ని ఒత్తిడి చేయలేము,” అని జాన్ కిర్బి సమాధానం చెప్పారు.

ఆయన చెపుతున్న ఈ మాటలు పఠాన్ కోట్ దాడి విషయంలో పాక్ ప్రభుత్వం కంగారుపడనవసరం లేదని, అలాగే భారత్ కోరుతున్నట్లుగా ఇప్పటికిప్పుడు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టనవసరం లేదని సూచిస్తున్నట్లుంది. నిజానికి ఈ సమయంలో అమెరికా కూడా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్లయితే, పాక్ ప్రభుత్వం తప్పకుండా ఉగ్రవాదులను అణచివేయడానికి కటినమయిన చర్యలు చేపట్టి ఉండేది. కానీ అమెరికా ఇస్తున్న ఈ భరోసాతో ఇప్పుడు ఉగ్రవాదులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా, భారత్ ఒత్తిడి చేసినప్పుడల్లా మరికొన్ని ఆధారాలు కావాలని అడుగుతూ చివరికి దీనిని కూడా మిగిలిన కేసులలాగే పక్కన పడేయవచ్చును.

ఇదే దాడి అమెరికా ఎయిర్ బేస్ పై జరిగి ఉంటే అప్పుడు అమెరికా ఎంత తీవ్రంగా స్పందించి ఉండేదో తేలికగానే ఊహించవచ్చును. తమకి చీమ కుట్టినా ప్రపంచ దేశాలన్నీ బాధపడాలని అమెరికా కోరుకొంటుంది. తనపై దాడి జరిగితే అది ప్రపంచంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ వెంటనే ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులున్న దేశంపైకి తన యుద్ద విమానాలను పంపించి బాంబుల వర్షం కురిపించేస్తుంది. ట్విన్ టవర్స్ పై తాలిబన్లు దాడి తరువాత అమెరికా ఎంత తీవ్రంగా ప్రతిస్పందించిందో ఒకసారి గుర్తు తెచ్చుకొంటే ఆ విషయం అర్ధమవుతుంది. కానీ పాక్ ఉగ్రవాదులు భారత్ సార్వభౌమత్వాన్ని సవాలు చేసినా అదేమీ పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడటమే చాలా విస్మయం కలిగిస్తోంది.

భారత్, పాక్ కీచులాడుకొంటున్నంత కాలమే అమెరికా పెద్దరికం చెల్లుతుంది. అది తయారు చేస్తున్న ఆయుధాలను ఇరుదేశాలకు అమ్ముకోగలుగుతుంది. భారత్-పాక్ ప్రధానుల మధ్య సఖ్యత ఇలాగే పెరిగినట్లయితే అప్పుడు అమెరికా పెద్దరికానికి విలువ ఉండదు. పెత్తనం చేయడానికి అవకాశం ఉండదు. బహుశః అందుకే ఆయన ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.

అమెరికా భారత్ పట్ల ఇటువంటి ద్వంద వైఖరి కనబరచడానికి ఇంకో బలమయిన కారణం కూడా ఉంది. అదేమిటంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులలో, కాంగ్రెస్ పార్టీ అవినీతి మయమయిన పరిపాలనలో కూడా భారత్ మంచి అభివృద్ధి సాధించింది. ఒకవేళ భారత్ కి ఈ ఉగ్రవాదం బెడద, పాకిస్తాన్ తో రక్షణపరమయిన సమస్యలు లేకపోయినట్లయితే, ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఏదో ఒకరోజు అమెరికాతో సరిసమానంగా భారత్ కూడా అగ్రరాజ్యంగా అవతరించవచ్చును. అలాగ జరగకూడదంటే భారత్ కి పక్కలో బల్లెంలాగ పాకిస్తాన్ ఉండాలని అమెరికా కోరుకొంటే అందులో ఆశ్చర్యం లేదు.

జాన్ కిర్బి మాట్లాడిన ఈ మాటలు అమెరికాకి ఎంతసేపు తన స్వార్ధ ప్రయోజనాలే తప్ప ఇతర దేశాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రాణాలు పెద్దగా లెక్కలోకి రావని స్పష్టం చేస్తున్నాయి. కనుక ప్రధాని నరేంద్ర మోడి ఇప్పుడు పాకిస్తాన్, అమెరికాలతో ఏవిధంగా వ్యహరించాలో బాగా ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేయడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close