అమిత్ షా ఎన్టీఆర్ భేటీ : తెర పైకి “రజాకార్ ఫైల్స్”, రాజకీయ వ్యూహం

అమిత్ షా ఎన్టీఆర్ ల భేటీ సర్వత్రా ఆసక్తి కలిగించిన సంగతి తెలిసిందే. పైకి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన కి ముగ్ధుడైన కారణంగానే అమిత్ షా ఈ భేటీ ఏర్పాటు చేశారన్న వ్యాఖ్యలు వినిపించినప్పటికీ, అసలు కథ ఇంకేదో ఉంటుందని అందరూ ఊహిస్తూనే వచ్చారు. అయితే అది ఏంటి అన్నది తెలియకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాజకీయాల కోసమే ఈ చర్చ అని కొందరు, మునుగోడు ఉప ఎన్నిక కోసం అని కొందరు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసమే ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచినట్లు వారు ఊహించుకోగా, ఇప్పుడు అసలు సంగతి బయటకు వచ్చింది.

ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి సమన్వయకర్తగా వ్యవహరించిన రచయిత విజయేంద్రప్రసాద్:

తాజా గా వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావాలన్న ఆలోచన రచయిత విజయేంద్రప్రసాద్ మదిలో నుండి వచ్చింది. బాహుబలి రచయిత అయిన విజయేంద్రప్రసాద్, రాజమౌళికి స్వయంగా తండ్రి అని, ఇటీవలే ఆయన బిజెపి పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారని తెలిసిందే. దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి మేలు చేకూరే ఆలోచన విధానాన్ని ప్రమోట్ చేసే సినిమాలను, సిరీస్ లను ప్రోత్సహించే వ్యూహాన్ని బిజెపి అనుసరిస్తోంది. దీనికి తగ్గట్టే ఇటీవల వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలకు బిజెపి అధికారికంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

రచయిత విజయేంద్రప్రసాద్ కు బిజెపి పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఎన్నిక చేయడం కూడా ఈ వ్యూహం లో భాగమే అని తెలుస్తుంది. త్వరలోనే ఆయన బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మీద ఒక వెబ్ సిరీస్ మరియు ఒక సినిమా తీయనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ఆర్ఎస్ఎస్ పట్ల గతంలో తప్పుడు అభిప్రాయంతో ఉండేవాన్ని అని, ఆర్ఎస్ఎస్ అంటే గాంధీని చంపిన సంస్థ అని దురభిప్రాయంతో ఉండేవాన్ని అని, కానీ కొద్ది నెలల క్రితం ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసిన తర్వాత తన అభిప్రాయం తప్పు అని తెలుసుకుని విపరీతంగా పశ్చాత్తాప పడ్డానని, కొద్ది రోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరన వచ్చే ఎత్తర జెండా పాటలో స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీ నెహ్రూల ఫోటోలు లేవు ఎందుకు అని అప్పట్లో విలేకరులు ప్రశ్నించినప్పుడు, దానికి ఆయన ఇచ్చిన సమాధానం కూడా బిజెపి ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద బిజెపి ఆలోచన విధానాన్ని మాస్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే బాధ్యతలను విజయేంద్రప్రసాద్ కూడా భుజాన ఎత్తుకున్నట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ స్వయంగా ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.

తెరమీదికి రజాకర్ ఫైల్స్:

1947 ఆగస్టు 15 భారతదేశం మొత్తం స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నప్పటికీ, తెలంగాణ సహా మరికొన్ని ప్రాంతాలు ఆ అదృష్టానికి నోచుకోలేదు. తెలంగాణ నిజాం నవాబు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఇవ్వడానికి ససేమీరా అనడంతో 1948 సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన పొందేంత వరకు తెలంగాణ ప్రజలు నవాబు పాలనలోనే ఉండిపోయారు. అయితే అప్పటికే నవాబు పాలనపై విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే, నవాబు రజాకార్ల సైన్యంతో ఆ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఆనాటి రజాకర్ల ఉద్యమాన్ని తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని విజయేంద్ర ప్రసాద్ భుజానికెత్తునట్లు తెలుస్తోంది. కాశ్మీరీ ఫైల్స్ తరహాలోనే రజాకార్ల ఫైల్స్ కూడా బిజెపికి రాజకీయంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది అనడం అతిశయోక్తి కాదు. నిజాం నవాబు పాలన సమయంలో, దొరలు ఏ రీతిగా తెలంగాణ ప్రజానీకాన్ని దోచుకున్నారు, నవాబుకు ఏ రకంగా వంత పాడారు అన్న అంశాలని తెరమీదకు తీసుకురావడం ద్వారా కేసిఆర్ సామాజిక వర్గంపై బీసీలలో ఎంతో కొంత వ్యతిరేకతను తీసుకొచ్చే వ్యూహం ఇందులో ఉండి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎన్టీఆరే ఎందుకు?

ఇటీవల తెలంగాణ యోధుడు కొమరం భీమ్ పాత్ర ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్, ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని చూపించే సినిమాలో ప్రధాన భూమిక పోషిస్తే తద్వారా వచ్చే మైలేజ్ నెక్స్ట్ లెవెల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఆర్ఆర్ఆర్ ద్వారా పాన్ ఇండియా స్టార్ హోదా సంపాదించుకున్న ఎన్టీఆర్ తో ఇటువంటి సినిమా చేయించడం ద్వారా, కాశ్మీర్ ఫైల్స్ తరహాలో దీన్ని కూడా దేశ వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మార్చే వ్యూహంతో బిజెపి ఉన్నట్లు అర్థమవుతుంది.

ఏది ఏమైనా ఇటువంటి రాజకీయ వ్యూహంతో కూడిన ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ తల దూరుస్తారా, బిజెపి పెద్దల ఒత్తిడికి తలొగ్గుతారా, నిజంగానే రజాకర్ ఫైల్స్ సినిమా తెరమీదకు వస్తుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close