టీడీపీ ప్లేస్‌లోకి బీజేపీ..! అమిత్ షా ప్లాన్ ఇదే..!?

భారతీయ జనతా పార్టీ…చోటు లేదనుకున్న రాష్ట్రాల్లోకి చొచ్చుకెళ్లిపోయింది. అనితర సాధ్యమైన విజయాల్ని నమోదు చేసింది. కానీ దక్షిణాది మాత్రం ఇంకా కొరుకుడు పడని వ్యవహారంలాగే ఉంది. కేరళ, తమిళనాడు, ఏపీల్లో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ… ఓ బలమైన అడుగుని మాత్రం.. కర్ణాటక, తెలంగాణ ద్వారా ఏర్పాటు చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏపీపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఏపీలో బీజేపీకి నోటాలో సగం ఓట్లు..!

తమిళనాడులో…అన్నాడీఎంకే సాయంతో.. బీజేపీ రాజకీయం చేస్తోంది. కేరళలో శబరిమల ఇష్యూతో.. అడుగు పెట్టింది. సీట్లేమీ సాధించకపోవచ్చు కానీ.. రాజకీయం చేయడానికి ఓ బేస్ ఏర్పాటు చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం.. బీజేపీకి ఓ కొరకరాని కొయ్యగా ఉంది. తిరుమల వెంకటేశ్వరుడ్ని వివాదం చేయడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి… ఒక్క శాతం కూడా ఓట్లు రాలేదు. 25లోక్‌సభ అభ్యర్థులకు కలిసి వచ్చింది మూడు లక్షల లోపు ఓట్లే. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులకు వచ్చింది ఇంకా తక్కువ. రెండున్నర లక్షలకన్నా కొద్దిగా ఎక్కువ. తమకు నలభై లక్షల సభ్యత్వం ఉందని.. బీజేపీ చెప్పుకుంటూ ఉంటుంది. వాళ్లు కూడా ఓట్లు వేయలేదు. నోటాకి అంతకు రెట్టింపు ఓట్లు వచ్చాయి. అంటే.. బీజేపీకి అసలు ఏపీలో బేస్ లేదని అర్థం.

ఇక టీడీపీపై గురి పెట్టనున్న బీజేపీ…!

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ఇలాంటి సవాళ్లే తీసుకుంటారు. ఐదేళ్ల కిందట.. అసలు ఉనికే లేని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు వయా తెలంగాణ.. ఏపీపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీని కోసం ముందుగా… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీనే గురి పెడతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేతను టార్గెట్ చేసి.. ఆ పార్టీ నేతలను.. ఒక్కొక్కరిగా బీజేపీకి లాగుతారని భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కానీ.. బెంగాల్‌లో కానీ.. బీజేపీ బలపడిందంటే.. దానికి కారణం… ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతల్ని అకర్షించడమే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో … ప్రజాబలం ఉన్న నేతల్ని గుర్తించి… వారిని ఆహ్వానిస్తారు. అసోంలో అసోం గణపరిషత్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల్ని చేర్చుకున్నారు.

సీబీఐ, ఐటీ, ఈడీలే కాదు.. జీవీఎల్ కూడా ఉంటారు..!

గతంలో బీజేపీ.. ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారికి మాత్రమే సీఎం పదవులు ఇచ్చేవారు. కానీ అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి.. సీఎం పదవులు ఇస్తున్నారు. అసోం , త్రిపుర సీఎంలు ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే.. వారికి ఆరెస్సెస్ నేపధ్యం కూడా లేదు. ఏపీలోనూ.. అదే వ్యూహం కొన్నాళ్ల కిందట అమలు చేశారు. దాని ప్రకారం.. కాంగ్రెస్ నుంచి కన్నా వచ్చి చేరారు. కానీ ప్రభావం పెద్దగా లేదు. ఈ సారి మాత్రం టీడీపీ నేతలపై కన్నేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా వ్యూహాలను అమలు చేయడానికి.. సీబీఐ, ఐటీలు రెడీగా ఉంటాయని… రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. ఈ ఆపరేషన్ వెంటనే కాకుండా… కాస్త గ్యాప్‌ ఇచ్చి ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఈ లోపు.. టీడీపీని మరింతగా ఇబ్బంది పెట్టే వ్యవహారాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది. జీవీఎల్ నరసింహారావు .. అమిత్ షా స్కెచ్‌లను ఇక్కడ అమలు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close