బీజేపీ పొగరు దిగిందా..? మిత్రపక్షాల వద్దకు అమిత్ షా..!!

తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత నాలుగేళ్లలో రాజకీయంగా తెచ్చిపెట్టుకున్నది అహంకారం మాత్రమేనని.. ఇతర రాజకీయ పార్టీలన్నీ విమర్శిస్తూంటాయి. అవి విమర్శలకే పరిమితం కాలేదు.. చేతల్లో కూడా బయటకు వచ్చాయి. బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టాయి. ఉపఎన్నికల్లో.. విపక్షాలన్నీ అదే స్ఫూర్తి కనబరచడంతో… భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా.. 2019 ఎన్నికల్లో మోదీ పరాజయం ఖాయమన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో… ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు కూడా పక్క చూపులు చూస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పేసిన తర్వాత ఎన్డీఏలో ఉన్న బలమైన మిత్రపక్షాలు రెండే.. ఒకటి శివసేన, రెండు జేడీ యూ. శివసేన ఎప్పుట్నుంచో బీజేపీతో విబేధిస్తోంది. కొన్ని రోజుల క్రితమే తాము ఒంటరి పోరుకు వెళ్తున్నామని ప్రకటించింది. ఉపఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు ప్రస్తావన తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ, అమిత్ షా ల చేతికి వెళ్లిన తర్వాత.. ఒకే రకమైన సిద్ధాంత భావజాలం ఉన్న శివసేనను.. కబళించడానికి ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన శివసేన.. చాలా దూకుడుగా బీజేపీతో తలపడుతోంది. అయినా సరే.. తమకు ఎదురు లేదన్న కారణంగా నాలుగేళ్ల పాటు… అమిత్ షా కానీ.. నరేంద్రమోదీ కానీ.. శివసేనను పట్టించుకోలేదు. ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమవడంతో … కుర్చీ కిందకు నీళ్లు వస్తున్న సంగతిని మోదీ, షా గుర్తించారు. అందుకే.. ఉన్న మిత్రపక్షాలను కూటమిలోనే ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

నాలుగేళ్ల పాటు శివసేనను పట్టించుకోని అమిత్ షా.. మారిన రాజకీయ పరిస్థితుల్లో.. ఉద్దవ్ ధాకరే ఇంటికి వెళుతున్నారు. ఉద్దవ్ అపాయింట్ మెంట్ కావాలని.. స్వయంగా అడిగి మరీ… ముంబై వెళ్తున్నారు. ఈ భేటీపై శివసేన నాయకులు.. మామూలుగానే స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు అమిత్ షాకు గుర్తుకు రాని మిత్రబంధం..నాలుగేళ్ల తర్వాత ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేయాలన్న తమ విధానంలో మార్పు వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు. మొత్తానికి శివసేనను ఒంటరి పోరుకు పోకుండా.. ఆపితే.. అది అమిత్ షాకు.. బీజేపీకి ప్లస్ పాయింటే.

ఆ తర్వాత బీహార్ మిత్రపక్షం జేడీయూతో అమెత్ షా చర్చలు జరపనున్నారు. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇటీవలి కాలంలో మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ… బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందడానికి ఒత్తిడి పెంచడానికే అలా చెబుతున్నారని.. ఆయన కూటమి నుంచి బయటకు పోరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ ను కూడా.. అమిత్ ఎలాగోలా బుజ్జగిస్తే.. ఎన్డీఏ అస్థిత్వం అయినా నిలబడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close