రోబో-2 లో అమితాబ్ ఉన్నట్టా లేనట్టా..!!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ శంకర్ తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ రోబో-2 లో చేస్తున్నారని వార్తలు కొద్దిరోజులుగా వస్తున్నాయి. ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడుతున్న రోబో-2ని హాలీవుడ్ స్టాండార్డ్స్ తో తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా ఆర్నాల్డ్ ని తీసుకున్నారని తెలిసిందే. అయితే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. రోబో-2 టీం దీన్ని ఖండించక పోయే సరికి ఈ వార్త నిజమే అనుకున్నారు. సూపర్ స్టార్ రజిని కాంత్ తో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడని సంబరపడ్డారు సిని అభిమానులు.

కాని తెలుస్తున్న వార్తల ప్రకారం ఇది కేవలం రూమర్ మాత్రమే అని అంటున్నారు. ఒకవేళ బిగ్ బి ఉండి ఉండుంటే ఆ ప్రకటన అధికారికంగా వచ్చి ఉండేదని.. రోబో-2 లో అమితాబ్ ఉండటం కేవలం మీడియా కల్పితమని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో శంకర్ డైరెక్ట్ చేస్తున్న రోబో-2లో రజిని సరసన ఎమీ జాక్సన్ నటిస్తుండగా.. ఐశ్వర్య రాయ్ కూడా ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ డిశెంబర్లో స్టార్ట్ అవ్వనుంది. శంకర్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రపంచదేశాలకు తెలియచెప్పే ప్రయత్నంగా శంకర్ రోబో-2 ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాడు. మరి ఇంత భారీ తనంతో వస్తున్న రోబో-2 ఎన్ని సంచలనాలను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close