సైరా అమితాబ్.. సై సైరా

‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి గురువుగా నటించడానికి హిందీ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘నైరా’ అన్నది అబద్ధమని తేలింది. ‘సైరా..’లో అమితాబ్ నటించడం లేదని వచ్చిన వార్తలన్నీ అసత్యాలు అని చిత్రబృందం స్పష్టం చేసింది. వచ్చే నెల ఫిబ్రవరిలో హైదరాబాద్లో ప్రారంభమయ్యే షెడ్యూల్లో అమితాబ్ షూటింగులో జాయిన్ అవుతారని కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అందుతోన్న సమాచారం. ఫిబ్రవరిలో చిరంజీవి, అమితాబ్, ఇతర ముఖ్య తారాగణంపై దర్శకుడు సురేందర్ రెడ్డి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. తర్వాత రాజస్తాన్, కేరళ రాష్ట్రాల్లో జరిగే షెడ్యూళ్లల్లో కూడా అమితాబ్ పాల్గొంటారని తెలిపారు. చిరు తనయుడు, చిత్రనిర్మాత రామ్ చరణ్ సినిమా విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారట. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకోవడంతో ఆయన ప్లేస్ రీప్లేస్ చేసే టాలెంటెడ్ పర్సన్ కోసం ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.