ఈ “ట్వంటీ- 20″కి హ్యాపీ కాదు బీపీనే..!

కొత్త శతాబ్దంలో మూడో దశాబ్దం ప్రారంభమవుతోంది. 2020 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశం.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలవబోతోంది. కచ్చితంగా జరుగుతాయని తెలుసు.. కానీ.. ఏం జరుగుతుందని తెలియకపోవడమే.. కొత్త ఏడాది విశిష్టత.

రాజధానిపై ఏపీ ప్రజలకు బీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. ఊరూవాడా హాట్ టాపిక్.. రాజధాని అంశం. ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని అమరావతి అని వచ్చిన ఓ గుర్తింపు.. ఉంటుందా.. ఊడుతుందా.. అనేది.. కొత్త ఏడాది… తొలి నెలలోనే తేలిపోనుంది. ప్రభుత్వ పట్టుదల ప్రకారం.. విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమే. కానీ అమరావతి ఎప్పటికైనా ప్రజారాజధాని అంటున్న మిగతా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు.. చివరికి కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ కూడా … ఏపీ సర్కార్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది జనవరిలోనే తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఏడాదిలో ఇదే పెద్ద బీపీ.

కేటీఆర్ టీ..ట్వంటీ కెప్టెన్ అయిపోతారా..?

తెలంగాణలోనూ .. కొత్త ఏడాదికి బీపీనే ఉంది. కొత్త ఏడాదికి .. రాజకీయ పార్టీలు.. చాలా ఉద్రిక్తంగా స్వాగతం పలుకుతున్నాయి. దీనికి కారణం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడమే. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారనేది.. ఈ ఎన్నికల్లో అంత పెద్ద విషయం కాదు. కానీ ఫలితాల తర్వాత మాత్రం.. మేలిమలుపు రాజకీయాలు ఉంటాయన్న అంచనానే.. అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తోంది. అదే.. కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యమైన విజయాలు సాధించడం ఖాయమనేది.. ఇప్పటికి మెజార్టీ రాజకీయ జనం ఒప్పుకునే అంశం. ఈ ఫలితాలు కేటీఆర్ దక్షతకు నిదర్శనమన్న సర్టిఫికెట్ ఇచ్చేసి.. ఆయనకు పట్టాభిషేకం చేస్తారనేది.. తెలంగాణ భవన్ ఇన్ సైడ్ టాక్.

ఆర్థిక మాంద్యం … దేశాన్ని ఓ ఆట ఆడేస్తుందా..?

ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పుడు భారత్ పై ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోవడం ఆర్థిక మాంద్యానికి ఒక సంకేతం. చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే రాబోయేది గడ్డుకాలమే అని స్పష్టమవుతోంది. కొత్త ఏడాది ఈ సవాల్‌ను కేంద్రం అధిగమించాల్సి ఉది. ఈ దిశగా కేంద్రం సీరియస్‌గా అనేక చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై 105 లక్షల కోట్లను ఖర్చు పెడతామని.. కొత్త ప్రకటన.. నిర్మలా సీతారామన్ చేశారు. కేంద్రం తీసుకునే చర్యలు… సవాళ్లను అధిగమించేలా ఉంటాయా… లేదా అనేది.. కొత్త ఏడాదిలోనే తేలిపోనుంది. సక్సెస్ అయితేనే హ్యాపీ..లేకపోతే.. దేశ ప్రజలకు తప్పదు బీపీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...

HOT NEWS

css.php
[X] Close
[X] Close