చైతన్య : దీక్ష మోడీ చేస్తే ఒప్పు.. చంద్రబాబు చేస్తే తప్పు..! అంతేగా.. అంతేగా..!

కన్నా జీ.. మన సభకు డబ్బులెవరు ఖర్చు పెట్టారు..?.. మోడీ ప్రశ్న..
పార్టీనే పెట్టుకుంది సార్..! … కన్నా ఆన్సర్..
కార్యకర్తల డబ్బుతోనే బీజేపీ సభ పెట్టుకుందని కన్నా చెబుతున్నారు..!.. జీవీఎల్ తర్జుమా.

గుంటూరులో జరిగిన నరేంద్రమోడీ సభలో… ఖర్చు గురించి చెబుతూ… నరేంద్రమోడీ, కన్నా, జీవీఎల్ వేసిన ఓ స్కిట్‌లో భాగంగా ఇదంతా జరిగింది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు … ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఆ దీక్షల కోసం ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజాధనం వాడుతున్నారని… ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందు కోసం.. ఈ స్కిట్ ప్లాన్ చేశారు. మోడీ హావభావాల విషయంలో.. మైనస్ మార్కులు పడే అవకాశం లేదు కాబట్టి.. బాగానే పేలిపోయింది. తోలుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టేశారు. కానీ… అసలు ఈ స్కిట్‌లో నిజాయితీ ఉందా..? అంటే.. మోడీ మార్క్ .. నిజాయితీ ఉందనుకోవాలి. ఎందుకంటే.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు.. ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ,ఐటీ దాడులను ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో ఇప్పుడంతా సమర్థిస్తున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు .. కారణం లేకపోయినా దీక్షల పేరుతో కోట్లు ఖర్చు చేసేవారు. ఇప్పుడు.. ఏపీ కోసం దీక్ష చేస్తున్నా.. దాన్ని ప్రజాధనం వృధాగా చెబుతున్నారు.

సీఎంగా ఉన్నప్పుడు రూ. 20 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో మోడీ దీక్షలు..!

గుజరాత్ ముఖ్యమంత్రిగా 2011-12లో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. మూడు రోజుల పాటు గుజరాత్ వ్యాప్తంగా సద్భావనా దీక్షలు నిర్వహించారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. గుజరాత్‌లో శాంతిని, సామరస్యాన్ని, ఐక్యతను కోరుతూ ఈ దీక్షలు చేశారు. అహ్మదాబాద్‌లో ఆయన దీక్షకు కూర్చోగా… ఆయన పరివారం మొత్తం వివిధ జిల్లాల్లో దీక్షలు చేసింది. ఈ మొత్తం ఖర్చులు .. ప్రభుత్వం పెట్టుకుంది. అప్పట్లోనే రూ. 20 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. పైగా ఈ మొత్తం… అత్యవసర నిధి నుంచి ఖర్చు చేశారు. ఈ ఖర్చుల వివరాలు మొదట్లో.. మోడీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. తర్వాత.. సమాచారహక్కు చట్టం కింద ధరఖాస్తు చేస్తే మొత్తం బయటకు వచ్చింది.

ప్రధాని అభ్యర్థిత్వం కోసమే ప్రజల సొమ్ముతో మోడీ దీక్షలు..!

ఇప్పుడు చంద్రబాబునాయుడు.. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై.. పోరాటం అనే ఓ కారణం చెబుతున్నారు. ఇది అచ్చంగా ఏపీ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. ఇలా పోరాటం చేయడం వల్ల చంద్రబాబుకు, టీడీపీకి.. ఏమైనా రాజకీయ ప్రయోజనాలు కలిగుతాయా.. లేదా అన్నది వేరే విషయం . కానీ మోడీ.. తొమ్మిదేళ్ల కిందట.. రూ. 20కోట్లతో చేసిన దీక్షలు దేని కోసం..?. భారతీయ జనతా పార్టీలో సాగుతున్న ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో విజయం సాధించడం కోసం. అప్పటికి బీజేపీ పుంజుకోలేకపోతోంది. అద్వానీ.. గొప్పగా పోరాటం చేయలేకపోతున్నారు. వాజ్‌పేయి… అనారోగ్యంతో మంచాన పడిపోయారు. ఇలాంటి సమయంలో.. హిందూత్వ వాదులకు ఓ బ్రాండ్‌గా ఉన్న మోడీ.. తాను రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి.. ప్రజల సొమ్ముతో దీక్షలు చేశారు. బీజేపీకి చెందిన అగ్ర నేతలుల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు అందర్నీ గుజరాత్ రప్పించుకుని … మద్దతుగా నిలిచేలా చేసుకుని.. ప్రధాని అభ్యర్థిత్వ కోసం రేసులో బలంగా నిలబడ్డారు.

చంద్రబాబు దీక్ష చేస్తే ఎందుకు తప్పు పడుతున్నారు..?

నరేంద్రమోడీ… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఓ రకంగా ప్రధానిగా ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు దెయ్యంలా కనిపించింది. అందుకే.. కేంద్రంపై విరుచుకుపడేవారు. అప్పట్లో కాంగ్రెస్ పదేళ్ల పాటు ఉంది కాబట్టి.. ఆయన సీబీఐ దగ్గర్నుంచి ప్రతీ విషయాన్ని రాజకీయం చేసేవారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా దారుణంగా ఆయన పాలన ఢిల్లీ నుంచి సాగుతోంది. ఇప్పుడు.. ఆయనకు అనిపించిన దానికంటే ముఖ్యమంత్రులకు అనిపిస్తోంది. కానీ.. మోడీ .. తాను ఒకప్పుడు చేసిన పనులను మర్చిపోయి… ఇప్పుడు … అన్యాయమైనపోయిన వారిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు తాను చేసిన దీక్షలను.. ఇప్పుడు వేరే వారు చేస్తే సహించలేకపోతున్నారు. అందుకే… అనైతికంగా రాజకీయ దాడులకు సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close