మోహ‌న్‌బాబు టీమ్ లో అన‌సూయ‌?

మంచు మోహ‌న్ బాబు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోబోతున్నారు. 24 ఫ్రేమ్స్ ప‌తాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు. ఆయ‌న కూడా ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇందులో క‌థానాయిక‌గా అన‌సూయ‌ని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్ర్కిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంది. మాధ‌వ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఓ త‌మిళ చిత్రానికి ఇది రీమేక్ అని, మోహ‌న్ బాబు పాత్ర కొత్త త‌ర‌హాగా సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. అన‌సూయ కూడా భారీగా కాల్షీట్లు కేటాయించాల్సివ‌చ్చింద‌ట‌. రంగ‌స్థ‌లంలో అనసూయ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మోహ‌న్ బాబు టీమ్ లో చేరింది. ఈ రెండు సినిమాల కోస‌మే.. బిగ్ బాస్ షోలో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చినా వ‌దులుకొన్న‌ద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.