వైవీఎస్ చౌదరి ధియేటర్‌ను సీజ్ చేసిన బ్యాంక్ అధికారులు

హైదరాబాద్: దేవదాసు, సీతయ్య, లాహిరి లాహిరిలో వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరికి గుడివాడలో ఉన్న సినిమా ధియేటర్‌ను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చౌదరి తన సొంతఊరైన గుడివాడలో బొమ్మరిల్లు అనే ధియేటర్‌ను నడుపుతున్నారు . అయితే ఆ ధియేటర్ మీద తీసుకున్న బకాయిలను కొంతకాలంగా చెల్లించకపోవటంతో ఆంధ్రా బ్యాంక్ అధికారులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు.

కె.రాఘవేంద్రరావు శిష్యుడైన చౌదరి అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో నాగార్జున నిర్మించిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రంతో చౌదరి తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సీతారామరాజు, యువరాజు వంటి చిత్రాలు తీశారు. అవి పెద్దగా విజయవంతం కానప్పటికీ, దేవదాసు, సీతయ్య, లాహిరిలాహిరిలో చిత్రాలు విజయవంతమై చౌదరికి కాసులపంట పండించాయి. కానీ ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా సలీమ్, బాలకృష్ణ హీరోగా ఒక్కమగాడు చిత్రాలు తీయగా అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే రవితేజ హీరోగా స్నేహితుడు గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన నిప్పు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రేయ్ చిత్రాల కారణంగా చౌదరి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రేయ్ చిత్రం షూటింగ్ పూర్తయ్యికూడా చాలాకాలం ఆగిపోయింది. సాయి ధరమ్ తేజ్ రెండో చిత్రం రిలీజై విజయవంతం అయిన తర్వాత రేయ్ విడుదలయింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close