కేసీఆర్‌పై బాంబు పేల్చిన ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍‌పై ఒక బాంబులాంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ వెలువరించింది. యూపీఏ-1 హయాంలో కేంద్ర కార్మికమంత్రిగా ఉన్న సమయంలో ‘సహారా గ్రూప్’ కంపెనీకి లబ్ది చేకూర్చేలా కేసీఆర్ అసాధారణ, అనుచిత నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ద్వారా మోడి ప్రభుత్వం గుర్తించినట్లు తమకు తెలిసిందంటూ ఇవాళ బ్యానర్ స్టోరీ ఇచ్చింది.

సహారా గ్రూప్‌కు చెందిన 5 కంపెనీలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రావిడెంట్ ఫండ్ స్వీయ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈపీఎఫ్ పరిధినుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారని, సీసీఎఫ్‌సీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేసీఆర్ బేఖాతరు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంవల్ల సహారా కంపెనీలకు చెందిన లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని వారి వేతనాలనుంచి మినహాయించుకున్న పీఎఫ్ వాటా డబ్బులు సహారా ఖాతాలో జమ అయ్యాయని పేర్కొన్నారు. కంపెనీ వాటా ఏమందో తెలియదని, తదనంతరకాలంలో సహారా గ్రూప్ దివాళా తీయటంతో పీఎఫ్ ఖాతాలు స్తంభించి తమ డబ్బులుకూడా దక్కని స్థితిలో కార్మికులు లబోదిబో మంటున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. కేసీఆర్ హయాంలో ఈఎస్ఐ భవన నిర్మాణాల కాంట్రాక్ట్‌లో అవినీతిపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారంలో కేసీఆర్ వాంగ్మూలాన్ని గతవారం సీఎమ్ క్యాంప్ కార్యాలయంలో నమోదు చేసింది. తాజాగా సహారా విషయంలో కేసీఆర్ స్టేట్‌మెంట్‌ను తీసుకోవాలని సీబీఐ భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే కేసీఆర్ బాధితుడైన ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు, కేసీఆర్‌ను వ్యతిరేకించే అనేకమందికి పండగే. అందుకే మరి మీడియాతో పెట్టుకోవద్దనేది. కేసీఆరేమో అధికారం చేతికందిన ఉత్సాహంలో నాడు – మీడియాను భూగర్భంలో పాతేస్తానంటూ ధమ్కీ ఇచ్చి వారితోనే పెట్టుకున్నాడు. చివరికి ఏమవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close