ఏపీ ఉన్నతాధికాలు మళ్లీ జైలుకెళ్తారని ఆంధ్రజ్యోతి హెచ్చరికలు..!

ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. మరీ గుడ్డిగా వ్యతిరేక కథనాలు ప్రచురించడం మాత్రం చాలా అరుదే. మూడు నెలల పదవీ కాలం తర్వాత .. అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుంది..? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది..? అన్న తర్వాత ఇన్‌సైడ్ సోర్సెస్‌తో ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ కథనం లక్ష్యం… ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే.. గతంలో.. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు… ఏం జరిగిందో.. అదే జరుగుతుందని … నేరుగానే చెప్పడం. అంటే.. నియమ నిబంధనలు పాటించకుండా.. ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని ఇష్టం వచ్చినట్లుగా.. జీవోలు విడుదల చేస్తే.. అంతిమంగా అది అదికారులు జైలుకెళ్లడానికే… దారి తీస్తుందని… చెప్పుకొచ్చారు.

మూడు నెలల కాలంలో.. ప్రభుత్వంలో ఏం జరిగిందో.. వివరించేందుకు.. కథనంలో ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ టీం ప్రయత్నించింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయి అధికారాన్ని పొందిన.. సలహాదారుగా మారిన మాజీ సీఎస్… ముఖ్యమంత్రి గుడ్డిగా ఇస్తున్న ఆదేశాలను అమలు చేయలేక… పై స్థాయిలో వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక.. ఇక గుడ్ బై చెబుదామన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన మాత్రమే కాదు… ఇక అధికార పరంగా ముఖ్యమంత్రి స్థాయిలో అధికారాలున్న వ్యక్తి కూడా.. గతంలో హడావుడి చేసినట్లుగా.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. ఆయనను కూడా.. చెప్పినట్లు చేయడం.. చెప్పిన దగ్గర సంతకాలు పెట్టమని ఆదేశించడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని… ఆంధ్రజ్యోతి విశ్లేషించింది.

ఆంధ్రజ్యోతి కథనంలో మరో విశేషం ఏమిటంటే.. ప్రభుత్వానికి ఏది కావాలో.. అదే నివేదిక ఇవ్వాలి.. ఇవ్వని అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేస్తున్నారట. అవినీతి కోసం.. జరుగుతున్న వేటలో ఒక్క ఆధారమూ పట్టుకోలేదని.. పదే పదే అధికారుల్ని బలిపశువుల్ని చేస్తున్నారని… ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. ఇటీవల కొన్ని బదిలీల్ని కూడా ఉదహరించింది. మొత్తానికి వైఎస్ హయాంలో.. ఏం జరిగిందో.. ఇప్పుడూ అదే జరుగుతోందని.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా చేస్తే.. చివరికి ఎక్కడకు పోతామో అన్న టెన్షన్ లో అధికారులు ఉన్నారని… ఆంధ్రజ్యోతి విశ్లేషించింది. చివరి వాక్యాంగా.. జైలు జీవితాన్ని ప్రస్తావించి… అధికారవర్గాల్లో కాస్త ఆందోళనను కూడా నింపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close