బడ్జెట్ : గత ఏడాది ఆదాయం కన్నా రూ. లక్ష కోట్ల ఎక్కువ ఖర్చు..!?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత..? ఈ ప్రశ్న కన్నా ముందు గత ఏడాది ఎంత ఆదాయం వచ్చింది..? ఎంత ఖర్చు పెట్టాం..? ఎంత లోటు ఉంది అన్నది కూడా లెక్కలేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే.. గత ఏడాది లోటు గత ఏడాదిదే.. ఈ ఏడాదికి సంబంధం లేదు అనుకోవాడనికి లేదు. గత ప్రభుత్వం అప్పులు తీసుకుంది కాబట్టి మేం కట్టం అన్నట్లుగా గత ఏడాది లోటుతో ఈ ఏడాది ఈ ఏడాది ఫ్రెష్ లోటు ఉంటుంది కదా అనుకోవడానికి లేదు. ఆ లోటు ఈ ఏడాది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అందుకే ఇప్పుడు.. గత ఏడాది లోటు ఎంత అనేదానిపై చర్చ జరుగుతోంది.

కేంద్రంతో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్‌ను ఆమోదించుకున్నాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం మూడు నెలలకు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదింప చేసుకుని ఖర్చులకు వాడుకుంటున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లెక్కలు కూడా తయారయ్యాయి. అందుకే.. లోటు ఎంత ఉంది.. అది ఎలా నెక్ట్స్ బడ్జెట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తారనేది ఆర్థిక నిపుణులకు ఆసక్తికరంగా మారింది. ఏ ఏడాది అయినా బడ్జెట్ వ్యయం అంచనాలకు తగ్గట్లుగా ఉండదు. అటూ ఇటూ ఉండదు. ఆ ప్రకారం.. గత ఏడాది ఎంత బడ్జెట్ ప్రకటించినప్పటికీ వ్యయం .. రూ. లక్షా ఎనభై వేల కోట్లకుపైగా ఉందని.. కానీ ఆదాయం మాత్రం రూ. 77వేల కోట్లేనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగ్ వేసిన అంచనాలను నెలవారీగా విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో ఈ అంచనాలు నిజమేనని చెబుతున్నారు. అంటే లక్ష కోట్లకుపైగానా లోటు ఉంది. ఆ లోటును ఇప్పటి బడ్జెట్‌లో బుగ్గన ఎలా కవర్ చేస్తారో చూడాలని చాలా మంది ఉత్కంఠగా ఉన్నారు. మూడు నెలల కాలానికి 70వేల కోట్ల వరకూ పద్దు ఆమోదించుకున్నందున… ఏడాది మొత్తం లెక్కలు రెండు లక్షల 80వేల కోట్లు కావాల్సి ఉంది. కానీ.. బడ్జెట్ .. రూ. రెండు లక్షల 30వేల కోట్ల లోపు ఉంటుందని… చెబుతున్నారు. ఆదాయ మార్గాలు.. లోటు భర్తీ ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close