ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీల‌క‌ నిర్ణ‌యాలు ఇవే..!

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. మంత్రి మండ‌లి స‌మావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాకు వివ‌రించారు. పెన్ష‌న్లు రెట్టింపు చేస్తూ ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యాన్ని జ‌న‌వ‌రి నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని చెప్పారు. రైతుల‌కు, ఆటోలు న‌డుపుకునేవారికి మేలు చేసే విధంగా ప‌న్ను మిన‌హాయింపు నిర్ణ‌యాన్ని కేబినెట్ తీసుకుంది. ట్రాక్ట‌ర్ల‌కు కూడా ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప‌ది ల‌క్ష‌ల వాహ‌నాల‌కుఈ ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చామ‌నీ, దీని వ‌ల్ల రూ. 66 కోట్ల 50 ల‌క్ష‌ల భారం అద‌నంగా ప్రభుత్వంపై  ప‌డుతుంద‌నీ, కానీ… రైతులు, ఆటోలు న‌డుపుకునేవారికి, చిన్న వాహానాల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న‌వారికి ఊర‌టను ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం ప్రభుత్వం తీసుకుందన్నారు.
చుక్క‌ల భూముల స‌మ‌స్య‌ల‌పై కూడా కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ చ‌ట్టంలోని కొన్ని అంశాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు ఆమోదం తెలిపింది. 2014 లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక‌, ప్ర‌భుత్వం సొంత ఇల్లు క‌ట్టిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ప్ర‌భుత్వ అనుమ‌తులు లేక‌పోయినా కొంత‌మంది ఇళ్లు నిర్మించుకున్నారు అని మంత్రి చెప్పారు. అయితే, టీడీపీ ప్ర‌భుత్వాన్నే న‌మ్ముకుని ఇళ్లు క‌ట్టుకున్నామ‌నీ, సాయం చేయాలంటూ చాలామంది ప్ర‌జ‌లు కోరుతున్న నేప‌థ్యంలో… ఇలా పేద‌లు నిర్మించుకున్న ఒక్కో ఇంటికీ రూ. 60 వేలు చొప్పున ఇచ్చేందుకు టీడీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని చెప్పారు. అంతేకాదు, 1996 నుంచి 2004 మ‌ధ్య కాలంలో నిర్మించిన ఇళ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు కూడా ఒక్కో ఇంటికీ రూ. 10 వేలు చొప్పున ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వ అధికారుల‌తోపాటు, జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించ‌డంపై కూడా ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీకి 25 కేటాయించేందుకు మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక విడ‌త డీయే విడుద‌ల చేస్తున్న‌ట్టు కూడా మంత్రి చెప్పారు. చేనేత కార్మికుల‌కు ఆరోగ్యబీమా ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. సోమ‌వారం రాత్రి ప‌దిన్న‌ర వ‌ర‌కూ జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల్లో ముఖ్యాంశాలు ఇవేనంటూ మంత్రి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close