ఎలక్షన్ కౌంట్‌డౌన్‌ 60 : సమర సన్నాహాల్లో టీడీపీ ముందడుగు వేసిందా..?

తెలంగాణ ఎన్నికల హడావుడి ముగిసీముగియక ముందే సార్వత్రిక ఎన్నికల సందడి.. ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికలపై అమితమైన ఆసక్తి కనబర్చిన అక్కడి ప్రజలు రాజకీయ వర్గాలు… ఫలితాలను తమకు తమకు అనుకూలంగా విశ్లేషించుకుని బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. నిజానికి రాజకీయ పార్టీలకు ఓ దీర్ఘ కాలిక కార్యాచరణ ఉంటుంది. ఏడాదిన్నర ముందు నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభిస్తారు. ఏపీలో టీడీపీ కూడా అదే పని ప్రారంభించింది.

అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు…!

ఎన్నికల సన్నాహాల్లో అత్యంత ముఖ్యమైనది అభ్యర్థుల కసరత్తు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏడాది కిందటి నుంచే జిల్లాల వారీగా.. సమీక్షలు చేసి.. అభ్యర్థులను ఖరారు చేసే పని ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసి సూచనలు కూడా పంపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో 30 నుంచి 40 మందిని మార్చుస్తామని కూడా పదే పదే పార్టీ నేతలకు చెప్పారు. ఆ విషయంలో వెనక్కి తగ్గే సూచనలు లేవు. ఆయా అభ్యర్థులకు ఇప్పటికే.. అంతర్గతంగా సమాచారం కూడా వెళ్లింది. కొంత మంది రియలైజ్ అయితే.. మరికొంత మంది పక్క చూపులు చూసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు. విపక్షానికి గట్టి నేతలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను.. చాలా ముందుగానే ఖరారు చేశారు. పులివెందులలో జగన్ పై సతీష్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనీషా రెడ్డి , రోజాపై గాలి ముద్దుకృష్ణనాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్ లాంటి వాళ్లకు నేరుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వారంతా.. నియోజకవర్గాల్లో చురుగ్గా పని చేసుకుంటున్నారు. వారి పని తీరును మదింపు చేసి.. సూచనలు సలహాలివ్వడానికి ఓ యంత్రాంగాన్ని కూడా చంద్రబాబు సిద్ధం చేశారు. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు చాలా క్లారిటీగానే ఉన్నారు.

పొత్తులపై కూడా క్లారిటీ వచ్చినట్లే..!

తెలంగాణ ఎన్నికల‌లో సత్ఫలితాలు వచ్చి ఉంటే… కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో చంద్రబాబు టెన్షన్ పడి ఉండేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా.. టీడీపీతో పొత్తు ఉండదని నేరుగా చెబుతున్నారు. చంద్రబాబు కూడా అదే సూచనలు పంపుతున్నారు. రాహుల్ గాంధీ కూడా తమ నేతలకు ఒంటరి పోటీకి సిద్ధం కావాలని సూచనలిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో జాతీయ అంశాలతో పాటు… ప్రత్యేకహోదా కూడా ఓ ప్రభావిత అంశం కానుంది. అందుకే.. పొత్తు పెట్టుకోకపోయినా.. అడ్వాంటేజ్ సాధించేందుకు చంద్రబాబు నాయుడు.. బీజేపీయేతర కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెసేతర కూటమిలో ఉంటున్నందున.. ఏపీలో పొత్తు పెట్టుకోకపోయినా… ప్రత్యేకహోదా, రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు జరుగుతుందని.. ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. ఈ విషయంలో.. చంద్రబాబు పక్కా ప్రణాళికతోనే ఉన్నారు.

సంక్షేమంలో సక్సెస్ – సామాజిక సమీకరణాల్లో అడ్వాంటేజ్..!

ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ చంద్రబాబునే ఆదర్శంగా తీసుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో అంతకు ముందు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరి జాబితాను.. చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చి.. అందర్నీ కలిసి.. ఓట్లు వేసేలా చేసుకున్నారు. అదే ఫార్ములాను కేసీఆర్ అవలంభించారు. సక్సెస్ అయ్యారు. తన వ్యూహాన్ని చంద్రబాబు మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో చేసింది అదే. ప్రతి ఒక్క లబ్దిదారుడ్ని కలిసి.. ఓటు వేసేలా చూసుకున్నారు. ఇప్పుడూ అదే చేయబోతున్నారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సంక్షేమ పథకాలు.. మరితం పారదర్శకంగా అమలవుతున్నాయి. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్ల, ఆదరణ లబ్దిదారులు లక్షల్లో ఉన్నారు. వీరందర్నీ ఓటర్లుగా మార్చుకునే ప్రణాళిక సిద్దం చేసుకుంది టీడీపీ. ఇక సామాజిక సమీకరణాల్లోనూ అడ్వాంటేజ్ సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి వ్యతిరేక పక్షాలు చీలిపోవడం.. చంద్రబాబు పనిని మరింత సులువు చేస్తోంది.

ఏ విధంగా చూసినా ఎన్నికల వ్యూహాల్లో… టీడీపీ ముందంజలో ఉన్నట్లే చెప్పుకోవాలి. అయితే వ్యూహాలన్నీ… ప్రీ ప్లాన్లే. అసలు అమలు చేసేటప్పుడు వచ్చే సవాళ్లను ఎదుర్కోవడంలోనే అసలు విజయం ఆధారపడి ఉంది. అది అసలు ఎలక్షన్ సినిమా ప్రారంభమైన తర్వాతే తెలుస్తుంది.

–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close