చైతన్య : ఏపీ ఎన్నికల ఎజెండా మారిపోయిందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఎజెండా మారిపోయినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకహోదాను ఎజెండాగా.. రాజకీయ పార్టీలు నిర్దేశిస్తాయని .. నిన్నామొన్నటిదా అనుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు..చర్చనీయాంశం అవుతాయనుకున్నారు. కానీ.. ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. పొరుగు రాష్ట్రం నుంచి.. ఏపీ అధికారపక్షంపై జరిగిన దాడి.. దాన్ని అందుకుని జగన్ చేస్తున్న రాజకీయంతో.. ఒక్క సారిగా.. ట్రాక్ మారిపోయింది.

ఏపీలో అభివృద్ధి, సంక్షేమాలు పక్కకు వెళ్లిపోయాయా..?

ఏపీ రాజకీయాల్లో కుట్ర కోణం ప్రధానంగా హైలెట్ అవుతోంది. అందులో మొదటిది.. ఓట్లను గల్లంతు చేసి విజయం సాధించాలనుకోవడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించిన తర్వాత నుంచి 59 లక్షల ఓట్లను తొలగించాలని ఈసీపై ఒత్తిడి తెచ్చారు. ఈసీ స్పందించలేదనో.. లేక.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్లానో కానీ… ఓ మూడు రోజుల పాటు వరసుగా.. ఫామ్‌-7ల వెల్లువ ఈసీకి వచ్చి పడింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు, ఆడ్రస్‌లు తెలుసుకుని మరీ లేఖలు రాసి.. ఫోన్లు చేస్తున్న వైసీపీ నేతలు… తమతో సాఫ్ట్‌గా మాట్లాడలేదని అనుకున్న వారందరి ఓట్లను మార్క్ చేసుకున్నారు. ఎక్కడిక్కడ ఫామ్‌-7లు దరఖాస్తు చేశారు. అసలు ఫామ్‌-7 అంటేనే ఇప్పటి వరకూ చాలా మందికి తెలియదు. దాదాపుగా 95 శాతం ఫేక్ దరఖాస్తులు. సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ వారికి పెద్ద ఎత్తున ఓట్లు నమోదయ్యాయి. కర్నూలు లాంటి జిల్లా మంత్రి ఫరూక్‌తో పాటు.. కుటుంబసభ్యుల ఓట్లూ గల్లంతయ్యాయి. దీంతో.. ఎవరి ఓట్లు చేరుస్తున్నారు.. ఎవరి ఓట్లు తీసేస్తున్నారన్నదానిపై.. ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఎన్నికల సమయానికి ఎవరికి ఓటు ఉంటుందో.. ఎవరికి ఉంటుందో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది.

ఫామ్‌-7, డేటా చోరీ రెండింటికి లింక్ ఉందా..?

ఓట్ల తొలగింపు వ్యవహారం.. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునేలోపే.. తెలంగాణలో ఐటీ గ్రిడ్ అనే కంపెనీపై పోలీసుల దాడులు కలకలం రేపాయి. ఇద్దరు వైసీపీ చోటా నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో.. రచ్చ ప్రారంభమయింది. తెలంగాణ పోలీసులు ఏపీ ప్రజల డేటా పేరుతో…నేరుగా ఆరోపణలు చేయడంతోనే.. అసలు వివాదం రాజుకుంది. డేటా చోరీ అయ్యే చాన్సే లేదని.. ఏపీ అధికారులు టెక్నికల్ అంశాలతో సహా వివరణ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ పోలీసులు రూటు మార్చారు. సేవామిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్నారు. ఈ వివాదంలో ఇప్పుడు… ఏపీ తరపున రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, తెలంగాణ తరపున ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలో ఉన్నాయి. అబద్దపు ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి ఆధారాలతో పరువు నష్టం కేసు ఫైల్ చేయాలనే ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే.. దేశ చరిత్రలో తొలిసారిగా.. ఓ ప్రభుత్వంపై.. మరో ప్రభుత్వం పరువు నష్టం దావా వేసినట్లవుతుంది.

తెలంగాణ పోలీసులతో జగన్ అనుకున్నది సాధిస్తారా..?

ఇప్పుడు.. ఏపీలో ఉన్న రాజకీయం ఇదే. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి చర్చించడం లేదు. అంతా డేటా చోరీ… ఓట్ల తొలగింపుపై చర్చిస్తన్నారు. రెండు పార్టీలు… ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే.. పొరుగు రాష్ట్రం నుంచి..జగన్ ఏపీ పై దాడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని టీడీపీ ప్రజల్లో కల్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పదే పదే తెలంగాణ పోలీసుల వద్దకు వెళ్లడం.. వారు కూడా.. ఏమీ లేని దానికి ఏపీ ప్రభుత్వంపై … కేసులు పెడతామని బెదిరిస్తూండటంతో.. ఏపీ ప్రజల్లో.. తమపై తెలంగాణ పెత్తనం ఏమిటన్న చర్చ ప్రారంభమైందని శివాజీ లాంటి వాళ్లు అంటున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే.. సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చ జరగకపోవడం.. డేటా చోరీ అంశమే హైలెట్ అయిందనుకుంటున్న వైసీపీ.. ప్రస్తుత పరిణామాలు తమకే లాభం చేకూరిస్తాయని ఆశ పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close