సమ్మె : ఉద్యోగులకు కష్టాలు.. ప్రభుత్వానికి మిగులు !

ఉద్యోగుల సమ్మె ఎలా చూసినా ఉద్యోగులకే కష్టనష్టాలు తెచ్చేలా కనిపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున జీత భత్యాల చెల్లింపులు నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. పని చేసిన ఈ నెలకూ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాత జీతాలు కావాలని ఉద్యోగులు అంటూంటే తక్షణం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామని బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉద్యోగులపై ఒత్తిడితెస్తున్నారు. ఉద్యోగులు మాత్రం తాము చేయలేమని మొండికేస్తున్నారు. ఇక నాలుగు రోజుల్లో జీతాలు అకౌంట్లలో పడాల్సిన పరిస్థితుల్లో ఇంత వరకూ జీతాలు చెల్లించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ప్రభుత్వం జీతాలివ్వాలనుకుంటే సీఎంఎఫ్ఎస్‌ వ్యవస్థ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకుని జీతాలిచ్చేయగలదు.కానీ అలా ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ప్రభుత్వ ఖాతాలో కాసులు ఉండాలి. గత నెలకు సంబంధించే కొంత మందికి జీతాలు పెండింగ్ ఉన్నాయని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త జీతాలకు డబ్బులు అంత తేలికగా రావు. ప్రభుత్వం అదనపు రుణానికి ఇంకా ఆమోదం తెలుపలేదు. ఆర్థిక శాఖతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశం అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నెల గండాన్ని తప్పించుకోవడానికి ఉద్యోగుల సమ్మె ప్రభుత్వానికి బాగా కలసి వస్తోంది.

మరి ఉద్యోగుల సంగతేంటి? వారు తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ నెల జీతం పెండింగ్ పెడితే.. ఇక ఇస్తారో లేదో చెప్పడం కష్టం. అలాగే సమ్మె చేసిన కాలానికి జీతం రావడం కూడా కష్టమే. గతంలో కరోనా పేరుతో ఆపేసిన జీతమే ఇంత వరకూ ఇవ్వలేదు. ఇప్పుడు అసలు ఇచ్చే చాన్స్ లేదు. ఎలా చూసినా సమ్మెకు వెళ్లి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రభుత్వానకి భారీ వెసులుబాటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close