తెలుగు (చిన్న) సినిమాకు చంద్రబాబు వరాలు!

తెలుగు సినిమాకు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిత్రాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పలు వరాలు ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న చిత్రాలకు పలు ప్రోత్సాహకాలను, రాయితీలను ప్రకటించింది. నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌లో నిర్మించే చిత్రాలను చిన్న సినిమాగా పరిగణిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన వరాల వివరాలు:

  • ఏపీలోని ప్రాంతాల్లో చిన్న సినిమాల చిత్రీకరణలకు ఉచితంగా అనుమతులు. అయితే… ముందుగా నిర్మాతలు ఎఫ్‌డీసీ (ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్)కి కాషన్ డిపాజిట్ చెల్లించాలి. చిత్రీకరణ పూర్తయిన తరవాత ఆ డబ్బును నిర్మాతకు తిరిగి ఇచ్చేస్తారు.
  • చిన్న చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు. ప్రస్తుతం సినిమాలపై 19 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అందులోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతాన్ని తొలగించనున్నారు.
  • తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన 15 చిత్రాలకు రూ. 10 లక్షల ప్రోత్సాహం. ఏడాదికి 15 చిన్న చిత్రాలకు ఈ నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఆ చిత్రాలను ఎంపిక చేయడానికి త్వరలో కమిటీ వేయనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుకోవాలంటే కొన్ని నిబంధనలు వున్నాయి. అవేంటంటే…

  • ఏపీలోనే చిన్న సినిమా చిత్రీకరణ చేయాలి. నిర్మాణాంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా అక్కడే చేయాలి.
  • <li నటీనటుల పారితోషకం వివరాలు తప్ప మిగిలిన ఖర్చుల వివరాలను ఎఫ్‌డీసీకి ముందుగా తెలియజేయాలి.

  • సినిమా నిర్మాణ సంస్థ కార్యాలయం ఏపీలో వుండాలి.

చిన్న చిత్రాల నిర్మాతలు ఈ నిబంధనలను పాటించారా? లేదా? అనేది నిర్ధారించుకున్న తరవాత ఏపీ ప్రభుత్వం రాయితీలు గానీ, నగదు ప్రోత్సహకాలు గానీ ఇస్తుందని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చిన్న సినిమా బతికితే ఎంతోమంది ఉపాధి లభిస్తుందని, అందువల్ల చిన్న చిత్రాలకు అండగా వుండాలని చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close