“పవర్ వార్”..! కేంద్రంపై కోర్టుకెక్కిన ఏపీ సర్కార్..!

విద్యుత్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని ఇప్పుడు… కేంద్రంపైనే కోర్టుకెక్కింది ఏపీ ప్రభుత్వం. సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టులో ఏపీ ప్రభుత్వంక సవాల్ చేసింది. దీంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఉన్న పళంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వకుంటే… ఎక్సేంజ్‌లో విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. అదే జరిగితే.. ఏపీ చీకల్లోకి వెళ్లిపోతుంది. అలాగని.. ఇప్పటికిప్పుడు… లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చేంత సొమ్ము ఏపీ సర్కార్ వద్ద లేదు. అందుకే… కేంద్రాన్ని ధిక్కరించి… హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఇంధనశాఖ. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎల్‌ఓసీలు సాధ్యంకాదని ఆ పిటిషన్‌లో ఏపీ సర్కార్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై మూడు వారాలపాటు హైకోర్టు స్టే ఇచ్చింది. విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అధికారం చేపట్టి నుండి… విద్యుత్ ఒప్పందాల విషయంలో కేంద్రంతో తగువు పడుతూనే ఉన్నారు. పీపీఏలపై జగన్ వైఖరి కారణంగా… దేశ పెట్టుబడుల వాతావరణంపై దెబ్బపడింది. మళ్లీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాము భరోసా ఇస్తామని చెబుతోంది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం… ఆ పీపీఏలను గౌరవించడం లేదు. తీసుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించడం లేదు. అందుకే.. కేంద్రం… లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానాన్ని పెట్టాలని నిర్ణయించింది. అలా ఇస్తేనే విద్యుత్ ఎక్సేంజీలో విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఉంటుందని చెప్పడంతో రాష్ట్రానికి షాక్ తగిలినట్లయింది.

ఇప్పటికిప్పుడు.. హైకోర్టుకు వెళ్లి మూడు వారాల స్టే తెచ్చుకున్నప్పటికీ.. కేంద్రంతో గొడవపడి… ముందుకెళ్లే పరిస్థితి ఏపీకి ఉండదు. అందుకే… వివిధ శాఖల నుంచి విద్యుత్‌శాఖకు రావాల్సిన.. పెండింగ్ బిల్లులపై సీఎస్ అత్యవసరంగా సమీక్ష చేశారు. మొత్తం రూ.6 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించిన సీఎస్.. చెల్లింపులు జరపాలని ఆర్ధికశాఖ అధికారులను ఆదేశిచారు అయితే.. ఏ శాఖ వద్ద కూడా నిధులు లేవు. ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close