ఆ ఉన్నతాధికారి ఆఫర్లను ఐఏఎస్‌లు లైట్ తీసుకున్నారా..?

పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఉన్న నెలన్నర రోజుల తేడా కారణంగా… ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు… రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులను రెచ్చగొట్టేందుకు… సాక్షాత్తూ ఓ అత్యున్నత అధికారే ప్రయత్నిస్తున్న వ్యవహారం ఇప్పుడు.. ఏపీ సచివాలయంలో కలకలం రేపుతోంది. ఓ పార్టీ మళ్లీ గెలుస్తుందని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. తానే .. అత్యున్నత పదవిలోఉంటారని.. తనను నమ్ముకున్న వారికి… కీలకమైన పోస్టులు దక్కుతాయనే భావన కల్పిస్తూ.. ఓ ఉన్నతాధికారి.. ఐఏఎస్‌లలో కొంత మందిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వాటిని ఖండించాలని.. ఆయన జూనియర్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు.

ఎందుకొచ్చిన గొడవ అనుకున్న కొంత మంది … ఐఏఎస్ అధికారులు.. ఈ మేరకు.. ఓ సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం అని పేరు పెట్టి… అందరూ ఐఏఎస్ అధికారులకూ సమచారం పంపారు. అయితే.. అత్యున్నత అధికారి ఇంటెన్షన్, ఆయన వ్యవహారాలపై… చాలా మంది తోటి అధికారుల్లో సందేహాలు ఉన్నాయి. ఆ సమావేశం పేరుతో.. అభ్యంతరకర తీర్మానాలు చేస్తే.. సర్వీస్ రూల్స్ ను అతిక్రమించినట్లవుతుందన్న భయంతో… ఎవరూ వెళ్లలేదు. 180కిపైగా ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘంలో.., కేవలం పది మంది మాత్రమే హాజరయ్యారు. దాంతో సమావేశానికి ప్రాధాన్యం లేకుండా పోయింది.

అంతకు ముందు.. ఐఏఎస్ అధికారంలదరూ కలిసి… ఉన్నతాధికారిపై.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారంటూ.. మీడియాకు సమాచారం ఇచ్చారు. కీలకమైన అధికారులు అందరూ వస్తారని… చెప్పుకొచ్చారు. దాంతో.. ప్రభుత్వంపై ఐఏఎస్ అధికారుల తిరుగుబాటు అన్న ఫీలింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ.. ఏ ఒక్కరూ.. ఆ అత్యున్నత అధికారిని నమ్మే సాహసం చేయలేకపోయారు. రాజకీయ ఎజెండాతో.. అధికారవర్గాల్లోనూ ఆయన విభజన చేస్తున్నారన్న అభిప్రాయంతో మెజార్టీ ఐఏఎస్‌లు ఉన్నారు. మరో నెల రోజుల పాటు.. తమకు ఈ కష్టాలు తప్పవని… ఐఏఎస్‌లు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close