బిల్లులు చెల్లించలేక ఆర్బిట్రేషన్ అంటే… దివాలానే !

ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్ట్రర్లకు బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. వేచి చూసి చూసి చాలా మంది కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుల్లో ప్రభుత్వం మోసం చేసిందని… బిల్లులు చెల్లించాలని దాఖలవుతున్న పిటిషన్లు ప్రతీ రోజూ వేలల్లో ఉంటున్నాయి. చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినా.. చెల్లించడం లేదు. దాంతో కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా వేలల్లోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చుకోవడానికి ప్రభుత్వం కొత్తగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. హైకోర్టులో ఇలాంటి బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి మాజీ న్యాయమూర్తులతో ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలని చూస్తోంది.

అలా చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చే చాన్సులు ఎక్కువ. ఎక్కడైనా బిల్లులు చెల్లించాలి కానీ.. చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రణాళికలు వేసుకోవడం ఏపీ సర్కార్ మాత్రమే చేస్తుంది. ఇలా చేయడం అంటే ప్రభుత్వంపై నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చిదిమేయడమేనని.. దివాలా తీసినట్లుగా పరోక్షంగా అంగీకరించడమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు… ఖచ్చితంగా డబ్బులు వస్తాయనే పనులు చేస్తారు. తీరా పనులు చేసిన తర్వాత ఏదో ఓ వంకతో ఆపేసి.. చివరికి వేధింపులకు పాల్పడటం అంటే.. అంత కంటే నీచమైన పని ఉండదు. ఏపీ ప్రభుత్వం అదే చేస్తోంది.

ఈ బిల్లులు..కేవలం టీడీపీ హయాంలోనివే కాదు. గత నాలుగేళ్లుగా వైసీపీ హయాంలో చేసినవి కూడా. చివరికి.. మాస్కులు కుట్టాలని మహిళలకు ఇచ్చిన పనుల బిల్లులుకూడా చెల్లించడం లేదని వారుసోషల్ మీడియాలో నెత్తి నోరూ బాదుకుంటున్నారు. కరోనాపేషంట్లకు భోజనాలు సరఫరా చేసి.. మొత్తంగా ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడిన వారుఉన్నారు. ఇలాంటి వారందర్నీ మోసం చేసి.. బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం సాధించడమే కాకుండా.. ఇప్పుడు ఎగ్గొట్టడానికి ప్రణాళికలు వేస్తోంది. ప్రభుత్వ ఖాజానానే కాదు.. ప్రభుత్వ పెద్దల ఆలోచనల దివాలా అని కూడా దీన్ని అనొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close