సులభ్ కాంప్లెక్స్ లకి రోజువారి టార్గెట్లు , వార్డు సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు

ఖాళీగా ఉందని తాజ్ మహల్ మీద తువ్వాలారేస్తావా ? అని ఓ సినిమలో కమెడియన్ సునీల్ సెటైర్ వేస్తాడు. ఏపీ ప్రభుత్వం వాడకం చెప్పాలంటే ఇంత కంటే చాలా ఎక్స్‌ట్రీమ్ డైలాగ్ వాడుకోవాలి. అయితే ఇక్కడ వాడుతోంది మాత్రం ఉద్యోగుల్ని. వార్డు సచివాలయ ఉద్యోగుల్ని సులభ్ కాంప్లెక్స్‌ల దగ్గర డబ్బుల వసూళ్లకు వాడేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని పే అండ్ యూజ్ టాయిలెట్లను నిర్మించింది. పలు సెంటర్లలో ఇవి ఉన్నాయి. వీటి వద్ద వార్డు సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలకు డ్యూటీ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి . డ్యూటీ చేస్తే సరిపోదు..  మరుగుదొడ్ల దగ్గర రోజుకు రూ. ఐదు వేలు వసూలు చూపించాలి.  టాయిలెట్ల దగ్గర డ్యూటీ కేటాయించిన వారిలో ఓ మహిళా వార్డు సెక్రటరీ, అడ్మిన్ కూడా ఉండటం ట్విస్ట్.
గుంటూరు కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి ఉద్యోగులు ఉలిక్కి పడ్డారు. సోషల్ మీడియాలోనూ ఈ ఉత్తర్వులు వైరల్ అయ్యాయి. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించారు. టాయిలెట్ల నిర్వహణను చూసే కాంట్రాక్ట్ ముగిసిపోయిందని.. కొత్తగా ఎవరికీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకూ సచివాలయ అడ్మిన్లకు బాధ్యతలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే అడ్మిన్లకు తోడుగా ప్రజారోగ్య కార్యకర్తలు ఉంటారని వారు డబ్బులు వసూలు చేస్తారని. వీరు డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తే చాలని చెప్పుకొచ్చారు.
కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేయడం కలకలం రేపింది. చర్చనీయాంశమయింది. ఇప్పుడు వార్డు సచివాలయ ఉద్యోగులకు మరింతదారుణంగా సులబ్ కాంప్లెక్స్ డ్యూటీలు వేయడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close